English   

త్వరలో సెట్స్ మీదకి కేజీఎఫ్ 2 !

KGF Chapter 2 starring Yash will go on floors in April
2019-03-08 21:46:22

బాహుబ‌లి త‌ర‌హాలోనే అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన కన్నడ సినిమా కేజీఎఫ్‌. క‌న్న‌డ రాక్‌స్టార్ య‌శ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమాలోని మొద‌టి భాగం కొద్ది రోజుల కింద‌టే విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన ఈ సినిమా దాదాపు బడ్జెట్ కి రెట్టింపు వ‌సూళ్లు సాధించింది. ఈ క్రేజ్ చూసాక రెండవ భాగం తెరకెక్కించాలని భావిస్తున్నారు యూనిట్. ఈ సినిమాకి రెండో భాగం ఉంటుంద‌ని కొన్నాళ్ళ నుండి వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికి ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంద‌నే విష‌యంలో క్లారిటీ లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఏప్రిల్ రెండో వారంలో ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ప్రారంభించాల‌ని భావిస్తున్నారట. కర్ణాటక రాష్ట్రంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కి అల్లుకున్న ఒక అక్రమ మైనింగ్‌ కధ నేపథ్యంలో కేజీఎఫ్ సిరీస్ తెరకేక్కుతున్నాయి. సీక్వెల్‌లో కూడా ఆయనే హీరోగా నటిస్తున్నాడు. ఇక ముఖ్య పాత్ర‌ల‌లో ర‌మ్య‌కృష్ణ‌, సంజ‌య్ ద‌త్‌ని తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఇక మొదటిభాగంలో చేసిన రవిశంకర్ అదే పాత్రలో రెండవ భాగంలోను కొనసాగుతాడట. కాకపోతే అత‌ని పాత్ర‌ని మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌గా రూపొందించ‌నున్నార‌ని అంటున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావల్సి ఉంది. చూడాలి మరి ఈ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో.

More Related Stories