English   

శ్రీ దేవి బంగ్లా టీజర్ 2...ప్రపంచం మొత్తం నీ నగ్న జీవితాన్ని చూస్తుంది !

Sridevi Bungalow Teaser 2
2019-03-17 09:13:53

ఓకే ఒక్క కన్ను గీతుతో ఓవర్ నైట్ పాపులర్ అయ్యింది కేరళ భామ ప్రియా ప్రకాష్ వారియర్. అయితే ఆమె అనుకున్నట్టు. అఆమే అభిమానులు ఊచించినట్టు మొదటి సినిమా లేకపోవడంతో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. నిజానికి ఆమె క్యారెక్టర్ చిన్నదే అయినా ఆమె కన్నుగీతుకి వచ్చిన రెస్పాన్స్ వలన ఆమె క్యారెక్టర్ ని పెంచినట్టు సినిమా పోయాక డైరెక్టర్ చెప్పుకొచ్చారు. అవన్నీ ప్రస్తుతానికి అప్రస్తుతం అనుకోండి, ఆమె రెండవ సినిమాగా శ్రీదేవి బంగ్లా రూపొందుతోంది. మళయాళ దర్శకుడు ప్రశాంత్ మామ్బుల్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి కొద్ది వారాల క్రితం ఒక టీజర్ రిలీజయ్యింది. అందులో కొన్ని సన్నివేశాలు నిజంగా ప్రమదావశాత్తూ మరణించిన అందాల నటి శ్రీ దేవి నిజ జీవితాన్ని పోలి ఉండడంతో ఈ సినిమా మీద , డైరెక్టర్ హీరోయిన్ మీదా శ్రీ దేవి భర్త బోణీ కపూర్ ఫిర్యాదులు కూడా చేశారు. ఆ తర్వాత ఈ వ్యవహరం ఏమైందో కానీ తాజాగా ఈ సినిమా నుండి రెండవ ట్రైలర్ రిలీజయ్యింది. నాకు ఎంత మంది ప్రపోజ్‌ చేశారో నీకు తెలుసా?’ అని ప్రియ ఓ యువకుడ్ని ప్రశ్నిస్తున్న డైలాగ్‌తో టీజ‌ర్‌ ప్రారంభమైంది. అలాగే టీజర్ కాస్త ఆసక్తికరంగా కట్ చేశారు. దునియా మొత్తం నీ న్యూడ్ లైఫ్ చూస్తుందని ప్రియాని ఓ వ్యక్తి బెదిరించటం ఇంకాస్త ఆసక్తి రేకెత్తిస్తోంది. మొదటి టీజర్ సమయంలో కేసు వేసిన బోనీ కపూర్ ఈ సారి ఏమి చేస్తారో వేచి చూడాలి.

 

More Related Stories