English   

అభినేత్రి2 టీజర్ టాక్ !

 Abhinetri
2019-04-16 17:43:51

2016లో విడుదలైన అభినేత్రి చిత్రం ప్రేక్షకుల్ని అలరించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌ గా అభినేత్రి-2 రూపొందినది. ప్రభుదేవా, తమన్నా, నందితాశ్వేత, డింపుల్ హయాతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా విడుదలకి సిద్దం అయింది. మే 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. విజయ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని ట్రైడెంట్ ఆర్ట్స్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్స్ మీద అభిషేక్ నామా, రవీంద్రన్ నిర్మిస్తున్నారు. సినిమా విడుదల దగ్గరపదడంతో ప్రమోషన్స్ మొదలు పెట్టింది సినిమా యూనిట్. ఈ నేపధ్యంలో ఈరోజు ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఈ టీజర్ ను బట్టి చూస్తే  ఈ సినిమా మొదటి భాగానికి కొనసాగింపుగా ఉన్నట్టు అర్ధమవుతోంది. అయితే గతంలో తమన్నాకి మాత్రమే దెయ్యం పట్టగా ఇప్పుడు ఈ పార్ట్ లో ప్రభుదేవాకి కూడా దెయ్యం పట్టినట్టు అర్ధమవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

More Related Stories