English   

మన్మధుడు 2 లో ఆ హీరోయిన్ కూడా ?

 Keerthy Suresh
2019-05-08 10:35:29

ఆఫీసర్, దేవదాస్ ఫ్లాప్స్  తర్వాత కింగ్ నాగార్జున చాలా రోజుల తర్వాత గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా మన్మధుడు2. చిలసౌ సినిమాతో సత్తా చాటిన నటుడు, యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈమూవీలో నాగార్జున సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ పోర్చుగల్ లో జరుగుతుంది. మన్మధుడు సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా మీద భారీగానే అంచనాలు ఉన్నాయి.  షూటింగ్ స్పాట్ నుంచి రిలీజ్ చేస్తున్న ఫోటోలు ఈ హైప్ ని మరింత పెంచుతున్నాయి. ఈ సినిమాలో సమంత ఓ స్పెషల్ పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.  సమంతకు సంబంధించిన షూట్ ఇటీవలే పూర్తయింది.  తాజాగా మరో టాప్ హీరోయిన్ కూడా ఈమూవీలో కనిపించనుందని సమాచారం. మహానటి మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ కూడా మన్మధుడు లో ప్రత్యేక పాత్రలో కనిపించనుంది టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఆమెకు సంబంధించిన సీన్స్ ను షూట్ చేస్తునట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక మన్మధుడు 2 మూవీ దసరా కానుకగా విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారు చిత్రయూనిట్.

More Related Stories