English   

మన్మధుడు 2లో సమంతా పాత్ర అదే

samantha
2019-05-12 09:29:39

చాలా ఏళ్ల క్రితం వచ్చిన మన్మధుడు సినిమా ఎంత పెద్ద హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాని అప్పాలతో త్రివిక్రమ్ రచించగా విజయ భాస్కర్ తెరకెక్కించారు. తాజాగా నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మథుడు సినిమాకి సీకేవ్ల్ గా మన్మధుడు 2 సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో సమంత ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ మధ్య ఆమె భాగం షూట్ కూడా అయిపోయిందని అన్నారు. దీంతో ఆమె పాత్ర ఎలా వుండనుందనే ఆసక్తి అందరిలోను తలెత్తుతోంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆమె ఈ సిన్నిమాలో కీలక పాత్ర పోషిస్తుందట. నిజానికి మొదటి భాగంలో హీరో అమ్మాయిలకి ఎందుకు దూరంగా వుంటాడనే విషయం చెబుతూ తనికెళ్ల భరణి సినిమాని ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళతాడు. సరిగ్గా అలాంటి పాత్రనే ఈ సినిమాలో సమంత చేస్తోందని అంటున్నారు. అయితే మన్మధుడు సినిమాలో అమ్మాయిలు పెళ్లి అంటే ఆమడ దూరం పారిపోయేలా దేజియన్ చేయగా ఈ సినిమాలో మాత్రం అందుకు భిన్నంగా హీరో అమ్మాయిలతో మాత్రమే చనువుగా ఉంటాడని అంటున్నారు. అయితే అందుకు గల కారణమేమిటనేది చెప్పే పాత్రలో సమంత నటించనుందని అంటున్నారు.

More Related Stories