English   

భారతీయుడు 2 షూట్ అందుకే ఆగిందట...కాజల్ క్లారిటీ 

Kajal Agarwal
2019-05-20 17:28:08

కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు 2 షూట్ పదే పదే ఎందుకు వాయిదా పడుతోంది? అసలు ఆ సినిమా ఆగిపోయిందా ? ఆగితే ఎందుకు ? అని రకరకాల ప్రశ్నలకి కాజల్ క్లారిటీ ఇచ్చింది. తేజ దర్శకత్వంలో కాజల్ 'సీత' అనే  సినిమా లీడ్ రోల్ లో చేసింది. ఈ సినిమాను, ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న కాజల్ ని ఈ సినిమా గురించి అడగగా భారతీయుడు 2 ఆగిపోయిందనే ప్రచారంలో నిజం లేదనీ, రాజకీయాలలో కమల్ బిజీగా ఉండటం వల్లనే షూట్ కి బ్రేక్ ఇచ్చారనీ మళ్ళీ జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు జరగనుందని చెప్పుకొచ్చింది. అలాగే ఈ సినిమా షూటింగులో ఎప్పుడెప్పుడు పాల్గొంటానా అని ఎంతో ఆత్రుతగా ఉన్నానని కూడా పేర్కొంది. అలాగే  తెలుగులో శర్వానంద్ తో ఒక సినిమా తమిళంలో జయం రవితో ఒక సినిమాను పూర్తి చేశాననీ త్వరలోనే ఈ రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయని కూడా ఆమె చెప్పుకొచ్చింది. 

More Related Stories