English   

జగన్ పాదయాత్ర నేపధ్యంలో యాత్ర 2

Yatra 2
2019-05-24 12:37:02

నవ్యాంధ్ర చరిత్రలో నూతన అధ్యాయం మొదలైంది. కాంగ్రెస్ నుంచి విభేదించి వైసీపీని స్థాపించిన జగన్ గత ఎన్నికల్లో దెబ్బ తిన్నా ఈ సారి ఎన్నికల్లో తన పార్టీని తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి తీసుకొచ్చిన వైనం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పాలి. 175 సీట్లున్న ఏపీ అసెంబ్లీలోకి ఏకంగా 150కి పైగా సీట్లతో అడుగుపెట్టడం అనేది మామూలు విషయం కాదు. అలాంటి ఘనత పిన్న వయసులోనే సాదించారు ఏపీ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రశంసల వెల్లువ వెలువడుతోంది. ఇక దివంగత వైఎస్సార్ పాదయాత్ర ఆధారంగా యాత్ర చిత్రాన్ని తెరకెక్కించిన టాలీవుడ్ యువ దర్శకుడు మహి వి రాఘవ్ జగన్ ఘన విజయం మీద స్పందించారు. ఈ విజయానికి మీరు నిజంగా అర్హులు జగన్ అన్నా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేసిన మంచిపనులను మించిపోయేలా మీరు పరిపాలన చేస్తారని భావిస్తున్నాం. భావితరాలకు వివరించదగిన చరిత్ర సృష్టించారు మీరు" అంటూ ట్వీట్ చేయడమే కాకుండా యాత్ర-2 అని దానికి యాత్ర ప్రొడ్యూసర్ శివ మేకను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. అయితే ఇంకేమీ ఆయన పేర్కొనక పోయినా ఆయన జగన్ గెలుపు ప్రస్థానాన్ని యాత్ర-2 గా తెరకెక్కించనున్నారని అంటున్నారు. చూడాలి మరి అది ఎంత వరకు నిజమవుతుందో ?

More Related Stories