English   

మ‌న్మ‌థుడు 2లో కీర్తిసురేష్ చ‌నిపోయే పాత్ర‌లో న‌టిస్తుందా..?

nag
2019-06-05 19:31:32

ఏమో ఇప్పుడు ఇలాంటి అనుమానాలే ప్రేక్ష‌కుల్లో వ‌స్తున్నాయి. మ‌న్మ‌థుడు 2 సినిమాలో హీరోయిన్లకు కొద‌వే లేదు. మ‌న్మ‌థుడు అంటేనే అమ్మాయిల‌కు రాకుమారుడు. దాంతో ఇప్పుడు నాగార్జున ఇదే చేస్తున్నాడు. 17 ఏళ్ల కింద వ‌చ్చిన మ‌న్మ‌థుడు సినిమాకు ఇప్పుడు సీక్వెల్ చేస్తున్నాడు ఈయ‌న‌. రాహుల్ రవీంద్ర‌న్ ఈ చిత్రాన్ని అదిరిపోయేలా తెర‌కెక్కిస్తున్నాడ‌ని తెలుస్తుంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న క్రేజ్ ఒకెత్తు అయితే.. ఇప్పుడు మ‌రో ఎత్తు. ఎందుకంటే సినిమాలో కీర్తిసురేష్ కూడా ఉంద‌నే విష‌యాన్ని ఈ మ‌ధ్యే క‌న్ఫ‌ర్మ్ చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. తాజాగా నాగార్జున‌తో కీర్తి ఉన్న ఫోటోల‌ను విడుద‌ల చేసారు. అస‌లు ఈ చిత్రంలో కీర్తి న‌టిస్తుంద‌నే విష‌యాన్నే గోప్యంగా ఉంచారు చిత్ర‌యూనిట్.
ఇప్ప‌టికే ఈ చిత్రంలో ర‌కుల్, స‌మంత న‌టిస్తున్నారు. స‌మంత క‌థ‌ను మ‌లుపు తిప్పే పాత్ర‌లో న‌టిస్తుంది. కోడ‌లు కాబ‌ట్టి ఆమె పాత్ర‌తో నాగార్జున‌కు ఎలాంటి రొమాన్సులు ఉండ‌వు. ఇక ఇప్పుడు కొత్త‌గా కీర్తిసురేష్ పాత్ర వ‌చ్చింది. అప్ప‌ట్లో మ‌న్మ‌థుడు సినిమాలో అన్షు పోషించిన పాత్ర‌నే ఇప్పుడు కీర్తి పోషిస్తుంద‌ని తెలుస్తుంది. ఈ చిత్రంలో కీర్తిసురేష్ చ‌నిపోయే పాత్ర‌లో న‌టిస్తుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈమె పాత్ర‌తోనే క‌థ మ‌రో మ‌లుపు తీసుకుంటుంద‌ని.. అప్ప‌ట్నుంచి అస‌లు క‌థ మొద‌లవుతుంద‌ని తెలుస్తుంది. క‌థ‌ను మ‌లుపు తిప్పే పాత్ర కాబ‌ట్టే మ‌రో మాట లేకుండా ఈ చిత్రం చేయ‌డానికి కీర్తిసురేష్ ఒప్పుకుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. మొత్తానికి కీర్తిసురేష్, ర‌కుల్, స‌మంత‌ల‌తో మ‌న్మ‌థుడు 2 నిజంగానే ఫుల్ గ్లామ‌ర‌స్‌గా మారిపోయింది.

 

More Related Stories