English   

మన్మధుడు 2 టీజర్ టైంని అలా ఫిక్స్ చేశారు

 Manmadhudu 2
2019-06-11 19:38:23

ఆఫీసర్, దేవదాస్ వరుస్ ఫ్లాప్స్ తర్వాత నాగార్జున చాలా రోజుల తర్వాత గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా మన్మధుడు2. చిలసౌ సినిమాతో దర్శకుడిగా సత్తా చాటిన నటుడు, యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాని తెరకేక్కిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమా షూట్ కి ఇంకా ఒక షెడ్యూల్ మిగిలి ఉంది. త్వర‌లోనే ఈ షెడ్యూల్ షూట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. నాగ్ కెరీర్ లో హిట్ సినిమా అయిన మన్మధుడు సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా మీద భారీగానే అంచనాలు ఉన్నాయి.  షూటింగ్ స్పాట్ నుంచే రిలీజ్ చేస్తున్న ఫోటోలు ఈ హైప్ ని మరింత పెంచుతున్నాయి. ఈ సినిమాలో సమంత ఓ స్పెషల్ పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.  సమంతకు సంబంధించిన షూట్ కూడా పూర్తయింది.  తాజాగా కీర్తి సురేష్ షూట్ కూడా పూర్తి చేశారు. అయితే సినిమా మీద ఉన్న హైప్ ని మరింత పెంచేందుకు ఈ సినిమా నుండి టీజర్‌ ను రిలీజ్ చేయనున్నారు యూనిట్. ఈనెల 13న టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పనిలో పనిగా నాగార్జున, అమలలకు పెళ్లిరోజు శుభాకాంక్షలు కూడా తెలిపేశారు. ఈరోజు నాగార్జున, అమలల 27వ పెళ్లి రోజు, ఈ క్రమంలో వారికి శుభాకాంక్షలు చెబుతూనే సినిమా టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించి వారికి అంకితం ఇచ్చింది రకుల్.

More Related Stories