English   

మన్మధుడు 2 టీజర్.. రొమాన్స్ తో రెచ్చిపోయిన నాగార్జున..

nagarjuna
2019-06-13 14:34:39

తెలుగు ఇండస్ట్రీలో మన్మధుడు అంటే మరో అనుమానం లేకుండా గుర్తొచ్చే హీరో నాగార్జున. నిజంగానే ఆ మన్మధుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ నాగార్జునను చూస్తుంటే ఇలాగే ఉంటారేమో అనిపిస్తుంది. 60 ఏళ్ల వయసులో కూడా అదే అందం అదే గ్లామర్ మెయింటైన్ చేస్తూ అదరహో అనిపిస్తున్నాడు నాగార్జున. తాజాగా విడుదలైన మన్మధుడు 2 టీజర్ చూసిన తర్వాత ఆయన గ్లామర్ చూస్తుంటే మెంటల్ ఎక్కడం ఖాయం.. ముందు ఈ వయసులో పెళ్లి ఏంటి.. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి.. పిల్లలకు ఇచ్చే టైం లో బ్యాటింగ్ మొదలుపెడతాను అంటావేంటి.. ఇలాంటి డైలాగులతో ఆసక్తి పుట్టించిన రాహుల్ రవీంద్రన్ ఆ తర్వాత అసలు కథ చూపించాడు. మన్మధుడు అంటే ఎలా ఉంటాడో ఈ సినిమాలో చూపించాడు రాహుల్. 17 ఏళ్ల కింద విజయభాస్కర్ తెరకెక్కించిన మన్మధుడులో అమ్మాయిలంటే పడని పాత్రలో నటించాడు నాగార్జున. కానీ ఇప్పుడు మాత్రం అమ్మాయిలతోనే ఉండి అమ్మాయిలతోనే పోయే పాత్రలో నాగార్జున కనిపిస్తున్నాడు. అసలు మన్మధుడు అంటే ఎలా ఉంటాడో ఇప్పుడు సీక్వెల్ లో చూపిస్తున్నాడు రాహుల్ రవీంద్రన్. ఈ ఏజ్ లో లిప్ లాక్ సీన్స్ చేసి ఔరా అనిపించాడు నాగార్జున. రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు మిగిలిన ముద్దుగుమ్మలతో కూడా ఇంగ్లీష్ ముద్దుల రుచి చూశాడు మన్మధుడు. ఆగస్టు 9న ఈ సినిమా విడుదల కానుంది. ఈ టీజర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

More Related Stories