మన్మధుడు 2 టీజర్....ఇప్పుడు రకుల్ వంతు !

దాదాపు పదిహేడేళ్ళ క్రితం వచ్చిన మన్మధుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. అందుకే ఈ సినిమాకి రీమేక్ కూడా చేస్తున్నారు. నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మథుడు సినిమాకి సీక్వెల్ గా మన్మధుడు 2 సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గ నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, సమంతలు కూడా అతిధి పాత్రలలో మేరవనున్నారు. ఈ సినిమాని ఈ ఆగష్టులో రిలీజ్ కి ప్లాన్ చేయడంతో ప్రమోషన్స్ కూడా గట్టిగానే మొదలెట్టారు. ఆ ప్రమోషన్స్ లో భాగంగానే ఈ మధ్య ఆ సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ లో నాగ్ పెళ్ళి కాని మిడిల్ ఏజ్ పర్సన్ గా, లవర్ బాయ్ గా ఆకట్టుకున్నారు. అయితే ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా ఒక్కరి ఫేస్ ని కూడా టీజర్ లో సరిగా చూపించలేదు, లిప్ లాక్ ఉన్నట్టు చూపారు కానీ ఒక్కరిని కూడా క్లారిటీ ఇవ్వలేదు. అప్పుడే రకుల్ ని చూపనందుకు ఆమె ఫ్యాన్స్ అలిగారు కూడా అయితే అప్పుడే ఆమె కోసం సెపరేట్ గా ఒక టీజర్ రిలీజ్ చేస్తామని రాహుల్ ప్రకటించారు. ఇక ఇప్పుడు రకుల్ టీజర్ కి కూడా టైం దగ్గర పడింది. ఆమె పేరు అవంతిక కాగా ఆమెను పరిచయం చేస్తూ ఒక టీజర్ రిలేజ్ చేస్తామని ఈ సినిమా యూనిట్ ప్రకటించింది. తొమ్మిదవ తారీఖు అంటే మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకి రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా ఆగస్ట్ 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే.