English   

మన్మధుడు 2 టీజర్ టాక్...సిగరెట్ తాగేస్తున్న రకుల్...

Rakul
2019-07-09 11:08:12

యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా రాహుల్ ర‌వీంద్ర‌న్ డైరెక్షన్ లో తెర‌కెక్కుతున్న సినిమా మ‌న్మ‌థుడు 2. నాగ్, అన్షు, సోనాలి బింద్రే కాంబినేషన్ లో దాదాపు పదిహేనేళ్ళ క్రితం వచ్చిన మన్మధుడు సినిమాకి ఇది సీక్వెల్. ఇక ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌, స‌మంత అతిధి పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. అయితే రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా మొదటి టీజ‌ర్ ఇటీవ‌ల‌ విడుద‌ల చేశారు. ఇందులో పెళ్ళికాని మ‌ధ్య వ‌య‌స్కుడిగా నాగ్ న‌ట‌న అభిమానుల‌ని ఆక‌ట్టుకుంది. కానీ టీజ‌ర్‌లో హీరోయిన్ ని చూపించ‌క‌ పోయే స‌రికి అభిమానులు రాహుల్ ర‌వీంద్ర‌న్‌కి ట్వీట్ చేశారు. అప్పుడే ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చిన రాహుల్‌ క్వీన్ లాంటి తమ హీరోయిన్ కోసం స‌ప‌రేట్‌ టీజ‌ర్ క‌ట్ చేశామని అందుకే ర‌కుల్‌ని టీజ‌ర్‌లో చూపించ‌లేదు అని తెలిపారు. ఇక ఆయన అన్న ఆ సెపరేట్ టీజర్ ఈరోజు విడుద‌ల చేశారు. ఇందులో రకుల్ అవంతిక అనే పాత్రలో నటించనుందని హింట్ ఇచ్చారు. ఇక పెద్దవాళ్ళ ముందు సంప్రదాయం నాగ్ ముంగిట ఇటు మోడ్రన్ గర్ల్ రెండు షేడ్‌లతో కలిసి కనిపించింది. టీజర్ చూస్తుంటే సినిమాలో ఆమె పాత్ర ఆసక్తికరంగా తీచిదిద్దినట్టు అర్థమవుతోంది. ఇక టీజర్ చివరిలో ఆమె సిగరెట్ తాగడం కూడా చూపారు. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి లక్ష్మీ, వెన్నెల కిశోర్, రావు రమేష్, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలో నటింస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్, వయాకామ్ 18స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం ఆగష్టు9న రిలీజ్ కానున్నట్టు ప్రకటించారు. 


 

More Related Stories