సాహోకి పోటీగా కేజీఎఫ్ 2 !

కన్నడ నాట తెరకెక్కిన ‘కేజీఎఫ్’ ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్ నుండి శంకర్, రాజమౌళి బాహుబలి తర్వాత బాలీవుడ్ ని ఒక ఊపు ఊపిన సినిమాల్లో ఒకటిగా చేటింది. కన్నడ సినీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమా వసూళ్లను రాబట్టింది. సౌత్ లో కూడా వేరే బాషలలోకి అనువాదం కాని కన్నడ సినిమా ఏకంగా బాలీవుడ్ వరకు వెళ్లడమే కాక ఒక పాత్ క్రియేట్ చేసుకుంది. ఇక ఈ సినిమా దెబ్బకు యష్ ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ అవడమే కాక రెండో పార్ట్ కోసం జనాలు కళ్ళు కాసేలా ఎదురు చూస్తున్నారు కూడా. తాజాగా ఈ సినిమా నుండి ఒక పెద్ద అప్డేట్ రానుందని వెల్లడిస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఈ పోస్టర్ లో "కె.జీ ఎఫ్ చాప్టర్ 2 బిగ్ న్యూస్ కమింగ్ యువర్ వే టుమారో ఎట్ 11 am" అని సి ఉంది. పోస్టర్ లో యష్ ముఖం కనిపించకుండా డిజైన్ చేశారు. కేజీఎఫ్ 2 షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి మరే అప్డేట్ లేదు. ఇప్పుడు ఒక బిగ్ అప్డేట్ అంటూ యూనిట్ ప్రకటించడంతో ఆ బిగ్ న్యూస్ ఏమై ఉంటుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యుంటుందని కొందరు అనుకుంటుంటే లేదు ఇంకా ఫస్ట్ లుక్ కూడా రాలేదు ఫస్ట్ లుక్ అయ్యుంటుందని అంటున్నారు. మరోకొందరేమో ఈ సినిమా సాహోతో పాటు రిలీజ్ కానుందని, సాహోకి పోటీగా సినిమాని రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేశారని అంటున్నారు. అయితే ఇందులో ఎంత నిజం ఉంది అనేది ఈరోజు పదకొండు గంటలకు తేలిపోనుంది.