English   

కేజీఎఫ్ చాప్టర్ 2 అధీరాగా సంజయ్ దత్...

 KGF Chapter 2
2019-07-29 11:39:57

గతేడాది చివర్లో విడుదలైన కెజీఎఫ్ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా కేవలం ఆడియన్స్ మౌత్ టాక్ తో ఘనవిజయం సాధించి ఒక్క కన్నడకే పరిమితం కాకుండా హిందీ పాటు సౌత్ ఇండియాలో విడుదలయిన అన్ని భాషల్లో విజయ విహారం చేసింది. ఈ సినిమా ఇంత ఎత్తున ఫేమస్ కావడంతో కేజీఎఫ్‌కు కొనసాగింపుగా కేజీఎఫ్‌ ఛాప్టర్ 2ని తెరకెక్కిస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక యష్ కి మార్కెట్ పెరగడంతో పాటు కేజీఎఫ్ అనే పదానికి కూడా మార్కెట్ పెరగడంతో బాలీవుడ్ సహా కొన్ని బాషలలో కీలకమైన పాత్రల కోసం స్టార్ నటులను రోప్ చేశారు. ఈరోజు రివీల్ చేస్తామని చెప్పినట్టే కొద్దిసేపటి క్రితం ‘కెజిఎఫ్ 2’లో ప్రధాన ప్రతినాయకుడైన అధీరా లుక్ ని సినిమా యూనిట్ విడుదల చేసింది. వెనుక భారీ ముసుగు సైన్యం ఉండగా ముసుగు ధరించిన సంజయ్ దత్ దానిని తొలగిస్తున్న లుక్ రిలీజ్ చేశారు. కేజీఎఫ్ చాప్టర్ 2లో ప్రధాన ప్రతినాయకుడైన అధీరా లుక్‌ని ఈరోజున విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ రెండ్రోజుల క్రితం ప్రకటించింది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌దత్ ఈ చిత్రంలో నటిస్తున్న నేపథ్యంలో, ఆయనే అధీరా పాత్ర చేసే అవకాశం ఉందని ప్రచారం జరగగా దానిని నిజం చేస్తూ ఆయననే అని కన్ఫాం చేసింది యూనిట్. మొదటి భాగంలో విలన్ గరుడ నే ఒక రేంజ్‌లో చూపించిన దర్శకుడు ప్రశాంత్, అధీరాగా సంజయ్ దత్ మరో రేంజ్ లో చూపిస్తాడనడంలో సందేహం లేదు. ఆ పూర్తి భీబత్సం చూడాలంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా ఆగాల్సిందే.

More Related Stories