English   

మన్మథుడు 2పై భారీ అంచనాలు నాగార్జున నిలబెడతాడా..

 Manmadhudu 2 Preview
2019-08-08 20:06:02

ఎందుకో తెలియదు కానీ నాగార్జున మన్మధుడు 2 సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంతకుముందు దీనిపై ఆసక్తి పెద్దగా కనిపించకపోయినా కూడా టీజర్స్ ట్రైలర్స్ విడుదలైన తర్వాత సినిమా రేంజ్ మారిపోయింది. బిజినెస్ పరంగా కూడా ఇది నాగార్జునకు టేబుల్ ప్రాఫిట్స్ తీసుకొచ్చింది. వయకం 18తో కలిసి నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఆగస్టు 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. కచ్చితంగా ఇది ప్రేక్షకులను అలరించడం ఖాయం అని.. తన కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ చూస్తారు మీరు అంటూ అభిమానులకు అభయమిచ్చాడు ఈ సీనియర్ హీరో. ట్రైలర్లో ముద్దు సీన్లు చూసి తను అంతా ఏదో తప్పు చేసినట్లు అడుగుతున్నారని.. ఈ వయసులో ముద్దు పెట్టుకోవడం తప్పేం కాదు.. అసలు రొమాన్స్ కు వయస్సుతో సంబంధం లేదు అని సమాధానం చెబుతున్నాడు నాగార్జున. ఇదిలా ఉంటే మన్మధుడు పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటున్నాడు నాగార్జున. ముద్దు సీన్లు చూసి ఇదేదో కేవలం కొన్ని వర్గాల కోసం తీసిన సినిమా కాదు.. టైటిల్ పడినప్పటి నుంచి ఎండ్ కార్డ్ వరకు నవ్వుతూనే ఉంటారు అని ప్రామిస్ చేస్తున్నాడు నాగార్జున. ఈ సినిమా దాదాపు 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగులో నాగార్జున కు పోటీ పెద్దగా లేదు. అనసూయ కథనం సినిమా అవుతున్న కూడా నాగార్జున సినిమాతో పోలిస్తే దానిపై అంచనాలు తక్కువే. ఇక ఓవర్సీస్ లో కూడా నాగార్జున సోలో గా వస్తున్నాడు. ఎటు చూసుకున్న కూడా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ సినిమా తొలి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే తరువాయి. ఆ తర్వాత కలెక్షన్లు వాటంతట అవే వస్తాయి. రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. కీర్తి సురేష్, సమంత ఇందులో కీలక పాత్రలు పోషించారు. రాహుల్ రవీంద్రన్ చి ల సౌ తర్వాత తెరకెక్కించిన సినిమా ఇది. మరి చూడాలి మన్మథుడు 2 ఒరిజినల్ మరిపిస్తుందో లేదో.

More Related Stories