English   

మన్మథుడు 2 రివ్యూ

Manmadhudu 2 Review
2019-08-09 13:48:46

17 ఏళ్ల కింద వచ్చిన మన్మథుడు సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ సినిమాలో నాగార్జున కామెడీ.. ఎమోషన్స్ అన్నీ వర్కవుట్ అయ్యాయి. మళ్లీ ఇప్పుడు అదే టైటిల్ తో సినిమా చేసాడు నాగ్. మరి ఈ సారి ఏం జరిగింది..? 

కథ:

భారత్ నుంచి పోర్చుగల్ కు 1928లోనే వచ్చి సాంబ శివ రావు ఉరఫ్ స్యామ్ (నాగార్జున) కుటుంబం అంతా సెటిల్ అవుతారు. అక్కడే మూడు తరాల వాళ్లుంటారు. ప్రతీ విషయాన్ని కుటుంబం అంతా కూర్చుని మాట్లాడుకుంటారు. ఆ కుటుంబ పెద్ద స్యామ్ తల్లి (లక్ష్మి). అయితే స్యామ్ కు వయసు వచ్చి వెళ్తున్నా కూడా పెళ్లి చేసుకోడు. దాంతో ఫ్యామిలీ అంతా కూర్చుని ఆయనకు మూడు నెలల్లో పెళ్లి చేయాలనుకుంటారు. కానీ స్యామ్‌ పెళ్లి అంటే దూరంగా.. అమ్మాయిలకు దగ్గరగా ఉంటాడు. ఇంట్లో పెళ్లి పోరు పడలేక అవంతిక (రకుల్)ను అద్దె ప్రియురాలుగా ఇంటికి తెస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది.. ఆమెతో స్యామ్ జర్నీ ఎలా సాగింది అనేది అసలు కథ.. 

కథనం:

మన్మథుడు అంటే కామెడీ ఎక్స్ పెక్ట్ చేస్తారు ప్రేక్షకులు. పైగా నాగార్జున కూడా ఇదే చెప్పాడు. ఒకప్పుడు ఆ సినిమాను చూసి ఎలా నవ్వుకున్నారో ఇప్పుడు ఈ సినిమాను చూసి కూడా ఇలాగే నవ్వుకుంటారు.. పొట్టలు చెక్కలైపోతాయి అన్నాడు. కానీ ఆయన చెప్పిన దాంట్లో నిజం కనిపించలేదు. ఆ మాటలను ఆయన నిర్మాతగా చెప్పాడేమో కానీ హీరోగా మాత్రం కాదని సినిమా చూసాక అర్థమవుతుంది. మన్మథుడు 2 అని 60 ఏళ్ల వయసులో చేసినపుడు కచ్చితంగా విమర్శలు వస్తాయని తెలుసు. కానీ ఇది తన వయసుకు తగ్గ కథ అని చెప్పాడు నాగ్. అయితే ఎంత సర్ది చెప్పుకున్నా కూడా ఇది నాగార్జున ఇమేజ్ కు డైజెస్ట్ చేసుకునే కథ కాదు. స్క్రీన్ పై మాత్రం మనకు కొత్త నాగార్జున కనిపించినా.. కథ మాత్రం పాతదే. దానికి తోడు రొటీన్ స్క్రీన్ ప్లే కూడా మన్మథుడు కొంప ముంచేసింది. 90 ఏళ్లుగా పోర్చుగల్లో స్థిరపడిపోయిన ఓ కుటుంబంలో ఏజ్ అయిపోయిన బ్యాచలర్ కు పెళ్లి చేయాలి.. దాన్ని తప్పించుకోడానికి అద్దె ప్రేయసిని తీసుకొస్తాడు హీరో.. ఇదివరకు అద్దె మొగుళ్లను తీసుకొచ్చిన కథలను చూసాం.. ఇప్పుడు జోడీ మారింది అంతే. అక్కడ్నుంచి వాళ్ల ప్రయాణం.. చివర్లో ఎమోషనల్ అయిపోయి ఇద్దరూ కలిసిపోవడం అనేది కామన్ కథ. ఇదే మన్మథుడు 2లో కూడా కనిపించింది. అయితే దాన్ని మరింత ట్రెండీగా తెరకెక్కించబోయే ప్రయత్నంలో పూర్తిగా గాడి తప్పినట్లు అనిపించింది రాహుల్ రవీంద్రన్. పైగా నాగార్జున లాంటి హీరో నుంచి డబుల్ మీనింగ్ డైలాగులు అస్సలు ఊహించలేం. ఫస్టాఫ్ వరకు ఎలాగోలా కామెడీతో పర్లేదనిపించినా కూడా సెకండాఫ్ మాత్రం పూర్తిగా కలగాపులగం అయిపోయింది. ఏ సీన్ ఎందుకు వస్తుందో అర్థం కాదు.. దాంతో మన్మథుడు 2 ప్రేక్షకుల మనసుకు చాలా దూరంగా ఆగిపోయే ప్రమాదం ఉంది. 

నటీనటులు:

నాగార్జున ఈ వయసులో కూడా ఇంత అందాన్ని ఎలా మెయింటేన్ చేస్తున్నాడో ఆయనకే తెలియాలి. అయితే తన పాత్రను ఇలా ఎంచుకోవడం మాత్రం కొత్తే. నాగచైతన్య, అఖిల్ కూడా చేయడానికి భయపడే పాత్రను ఈ ఏజ్ లో తీసుకున్నాడు నాగార్జున. నటుడిగా ఒప్పించినా.. సినిమాను నచ్చేలా చేయడం మాత్రం కష్టమే. రకుల్ గ్లామర్ షోతో మాయ చేసింది. వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. కీర్తి సురేష్, సమంత కొన్ని నిమిషాల పాటు కనిపించారు. లక్ష్మి, ఝాన్సీ లాంటి వాళ్లు తమ పాత్రల మేర కనిపించారు. రావు రమేష్ కాసేపు కనిపించినా అలరించాడు.

టెక్నికల్ టీం:

ఆర్ఎక్స్ 100 లాంటి సినిమా తర్వాత చేతన్ భరద్వాజ్ సంగీతం అంటే ప్రేక్షకులు బాగానే ఊహిస్తారు. కానీ అది జరగలేదు. స్టార్ హీరోలకు ఈయన కష్టమే. మన్మథుడు సినిమాకు మరిచిపోలేని సంగీతం అందించాడు దేవీ. కానీ ఇక్కడ సీన్ రిపీట్ కాలేదు. సినిమాటోగ్రఫర్ పోర్చుగల్ అందాలను బాగా క్యాప్చర్ చేసాడు. ఎడిటింగ్ చాలా వీక్. సినిమాలో చాలా వరకు బోరింగ్ సీన్స్ కనిపించాయి. సెన్సార్ కట్స్ కూడా ఉన్నాయి. చిలసౌతో దర్శకుడిగా మెప్పించినా కూడా ఇప్పుడు రాహుల్ ఎంచుకున్న కథ సరిగ్గా లేదేమో. 

చివరగా:

మన్మథుడు 2.. ఆకట్టుకోని నాగార్జున ముదురు ప్రేమకథ..

రేటింగ్ : 1.5 / 5.

More Related Stories