English   

మన్మథుడు 2 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..నాగార్జునకు మరో డిజాస్టర్..

  Manmadhudu 2
2019-08-12 20:04:28

ఆ మధ్య వరస విజయాలు అందుకున్న నాగార్జున ఇప్పుడు మళ్లీ పూర్తిగా గాడి తప్పాడు. ఈయన సినిమాలు వచ్చి వెళ్లినట్లు కూడా తెలియడం లేదు. గతేడాది ఆఫీసర్, దేవదాస్ లాంటి ఫ్లాపులతో వచ్చిన మన్మథుడు.. ఇప్పుడు మరోసారి అదే బాట పట్టాడు. తాజాగా ఈయన నటించిన మన్మథుడు 2 డిజాస్టర్ కాబోతుంది. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ చిత్రం తొలిరోజే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. తొలిరోజు 5.50 కోట్ల షేర్ వసూలు చేసి ఔరా అనిపించిన ఈ చిత్రం ఆ తర్వాత మాత్రం దారుణంగా బోల్తా పడింది. ఆ తర్వాత రెండు రోజుల్లో కేవలం 3 కోట్లు మాత్రమే వసూలు చేసింది మన్మథుడు 2. మూడు రోజుల తర్వాత ఈ చిత్ర వసూళ్లు చూస్తుంటే బయ్యర్లకు భయం పుడుతుంది. వెన్నులో వనుకు వచ్చేలా వస్తున్నాయి దీనికి వసూళ్లు. ఎందుకంటే అమ్మింది 19 కోట్లకు అయితే ఇప్పటి వరకు వచ్చింది మాత్రం కేవలం 8.5 కోట్లు మాత్రమే. దాంతో ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. ఇప్పట్నుంచి ఈ చిత్ర కలెక్షన్లు వస్తాయనడంలో కూడా సందేహమే ఉంది. బక్రీద్ హాలీడే ఉన్నా కూడా కలిసొచ్చేలా మాత్రం కనిపించడం లేదు. ఏం చేసినా కూడా ఇప్పుడు మన్మథుడు 2 గట్టెక్కడం కష్టమే. 11 కోట్ల వరకు బాకీ ఉన్న ఈ చిత్రం.. ఇప్పుడు పూర్తిగా కళ తప్పింది. నైజాంలో 2.61 కోట్లు.. సీడెడ్ 84 లక్షలు.. ఉత్తరాంధ్ర 89 లక్షలు.. వెస్ట్ 44 లక్షలు.. ఈస్ట్ 52 లక్షలు.. కృష్ణా 54 లక్షలు.. గుంటూర్ 83 లక్షలు.. నెల్లూరు 29 లక్షలు వసూలు చేసింది ఈ చిత్రం. మూడు రోజుల్లో ఆంధ్ర తెలంగాణల్లో కలిపి 6.50 కోట్ల షేర్.. ప్రపంచ వ్యాప్తంగా 8.5 కోట్లు షేర్ వసూలు చేసింది మన్మథుడు 2. మొత్తానికి ఇదంతా చూస్తుంటే మరోసారి నాగ్ కెరీర్ లో డిజాస్టర్ వచ్చి చేరిపోయేలా కనిపిస్తుంది.

More Related Stories