English   

సైరా డే 2 కలెక్షన్స్...అదే చిరు మార్క్

Sye Raa Narasimha Reddy
2019-10-04 12:09:30

అన్ని బాషలలో మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 82 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి తన స్టామినా ఎక్కడా తగ్గలేదని నిరూపించుకున్నాడు మెగాస్టార్. ప్రభంజనం అంటే ఎలా ఉంటుందో సైరా సినిమాతో బాక్సాఫీస్‌కి రుచి చూపింస్తున్నారు. ఇక రెండో రోజు కూడా చిరంజీవి తన ప్రభంజనాన్ని కంటిన్యూ చేసాడు. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన సైరా సెకండ్ డే కూడా 45 కోట్ల వరకు రాబట్టింది అనేది ట్రేడ్ వర్గాల సమాచారం. మొదటి రోజు 37 కోట్లకు పైగా ఉన్న షేర్ కూడా 47 కోట్ల దాకా రాబట్టింది. 

అంటే షేర్ పరంగా కూడా కేవలం తెలుగు వెర్షన్‌ తోనే హాఫ్ సెంచరీ దగ్గరకి వచ్చారు. రెండ్రోజుల కలెక్షన్స్ చూస్తే నిజాం 12.12 కోట్లు,  సీడెడ్ 7.30 కోట్లు, వైజాగ్ 6.28 కోట్లు, ఈస్ట్ 5.29 కోట్లు, వెస్ట్ 4.37 కోట్లు, కృష్ణా 3.75 కోట్లు, గుంటూరు 5.73 కోట్లు, నెల్లూరు  2.40 కోట్లు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 47.24 కోట్లు సాధించింది. అలాగే రెండు రోజుల్లో కేవలం తెలుగు వెర్షన్ తోనే 100 కోట్లు కొల్లకొట్టాడు మెగాస్టార్. ఈ వీకెండ్‌కి షేర్ కూడా 100 కోట్లు టచ్ అవుతుందని అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్స్ బట్టి అర్ధమవుతోంది. 

కర్ణాటకలో కూడా సైరా ప్రభంజనం ఒక రేంజ్‌లో సాగుతుంది. మొదటి రోజు అక్కడ 8 కోట్లవరకు రాబట్టిన సైరా సెకండ్ డే కూడా 5 కోట్లు కొల్లగొట్టింది. ఇక వీకెండ్‌లో మాత్రం ఈ నంబర్స్ చాలా పెద్దగా ఉండబోతున్నాయి. ఓవర్సీస్‌లో కూడా రెండో రోజు కాస్త నెమ్మదిగా మొదలైన సైరా టికెట్ సేల్ ఫస్ట్ షో నుండి మాత్రం పెరిగింది. వర్కింగ్ డేస్ లో ఆ కలెక్షన్స్ అంటే మాటలు కాదు.  ఇక ఈ వీకెండ్ గడిస్తే కానీ ఈ సినిమా ఏ రికార్డ్స్ బ్రేక్ చేసిందనే విషయంలో క్లారిటీ రాదు.

More Related Stories