English   

వార్ 2....ప్రభాస్ తో హృతిక్ క్రేజీ కాంబో

Prabhas
2019-10-22 10:33:34

హృతిక్‌ రోషన్‌ ఎట్టకేలకు 300 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఆరేళ్లుగా సరైన హిట్ లేక వెనుకపడిపోయిన హృతిక్‌ వార్‌తో బాక్సాఫీస్‌పై యుద్ధం చేసి సత్తా చాటాడు. సినిమా రిలీజైన 19వ రోజు ఇండియాలో 300 కోట్లు దాటేసింది. ప్రతి హీరోకు టైం వస్తుంది. అయితే అది ఎప్పుడు వస్తుందో తెలీదు. ఏడాదికే వస్తుందా? లేదంటే పదేళ్ల తర్వాత వస్తుందా? అంటే చెప్పలేం. హృతిక్‌ రోషన్‌కు ఆరేళ్ల తర్వాత వచ్చింది. పర్సనల్‌గా కెరీర్‌పరంగా డౌన్‌ఫాల్లో వున్న ఓ స్టార్‌ హీరో ఎట్టకేలకు సక్సెస్‌ అందుకున్నాడు. 

సూపర్‌ 30 సినిమాలో పెర్‌ఫార్మెన్స్‌తో ఇంప్రెస్‌ చేసినా బాక్సాఫీస్‌ను ఆకట్టుకోలేకపోయాడు. ఈలోటును వార్‌ తీర్చింది. 2013లో వచ్చిన క్రిష్‌3 200 కోట్ల మార్క్‌ దాటింది. ఆతర్వాత వరుస ఫ్లాపులతో హృతిక్‌ కెరీర్‌ డైలమాలో పడింది. ఇక సక్సెస్‌ కష్టమే అనుకుంటున్న టైంలో టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి నటించిన వార్‌ పూర్వ వైభవం తీసుకొచ్చింది. అక్టోబర్‌2న రిలీజైన వార్‌ 19 రోజుల్లో ఇండియాలో 300 కోట్లు దాటింది. డివైడ్‌ టాక్‌తో సంబంధం లేకుండా.. మంచి వసూళ్లు రాబట్టింది.  హిందీ వెర్షన్‌ 287 కోట్లు..తెలుగు, తమిళ వెర్షన్స్‌ 13 కోట్లు కలెక్ట్‌ చేయడంతో.. టోటల్‌గా 300 మార్క్‌ దాటింది. 

వీకెండ్‌లో ఇప్పటికీ నాలుగైదు కోట్లు కలెక్ట్‌ చేస్తూ ఈ వారాంతరానికి ఒక్క హిందీలోనే 300 కోట్లు దాటే అవకాశం వుంది. అయితే వార్ మూవీని కొనసాగించాలని, ధూమ్ తరహాలో సిరీస్ లు రూపొందించాలని యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ భావిస్తోంది. వార్ 2లో హృతిక్ రోషన్ ధీటుగా నిలబడే మరో హీరో కోసం యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా ప్రభాస్ పేరుని పరిశీలిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ప్రభాస్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. హృతిక్ కి సౌత్ లో మంచి మార్కెట్ ఉన్నప్పటికీ భారీ వసూళ్లు తెచ్చిపెట్టే స్థాయిలో లేదు.  అందువల్ల ప్రభాస్ ని వార్ 2లో నటింపజేస్తే కలెక్షన్ల ప్రభంజనం సృష్టించవచ్చని భావిస్తున్నారు. సినిమా అంటేనే కమర్షియల్ మార్కెట్ కాబట్టి ఏమైనా జరగచ్చు వేచి చూద్దాం ఏమవుతుందో ?  

More Related Stories