English   

కార్తికేయ 2 లో హీరోయిన్ ఆమేనా

anu
2020-01-26 20:03:26

2014 లో నిఖిల్, కలర్స్ స్వాతి లీడ్స్ గా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'కార్తికేయ' ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ హిట్ సినిమాకి సీక్వెల్‌గా ‘కార్తికేయ-2’ సినిమాని ప్లాన్ చేశారు. నిఖిల్ హీరోగా, చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ-2' పేరుతో రూపొందనున్నట్టు గత ఏడాది మేలోనే ప్రకటించారు మేకర్స్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ మీద నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. దర్శకుడు చందు మొండేటి చివరిగా తెరకెక్కించిన సవ్యసాచి సినిమా పెద్ద దెబ్బే వేసింది. ఇక నిఖిల్ అర్జు సురవరం రిలీజ్ అయినా సినిమా బాగున్నా పెద్దగా పేరు రాలేదు. ఇక ఈ సినిమా షూటింగ్ జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించాలని యూనిట్ భావిస్తోంది. అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ అంటూ పలువురి పేర్లు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కార్తికేయకు ఈ సినిమా కొనసాగింపుగా ఉంటూనే సరికొత్త కధనంతో ఉంటుందని అంటున్నారు. ఇక కొంచెం బడ్జెట్ ఎక్కువ కావడంతో ఈ సినిమాని  తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

 

More Related Stories