English   

ఆర్ఆర్ఆర్ కి పోటీగా భారతీయుడు 2

Indian 2
2020-02-07 10:43:13

అనుకున్నట్టుగానే ఆర్ఆర్ఆర్ వాయిదా పడింది. సంక్రాంతి మార్కెట్ మీద కన్నేశాడో  నిజంగా లేట్ అవుతుందేమో తెలీదు కానీ సినిమా అయితే వాయిదా పడింది. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ క్రేజీ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ దెబ్బకి సంక్రాంతి రిలీజ్ అనుకున్న సిన్మాలు అన్నీ వెనక్కి పోతున్నాయని అనుకున్నారు. అయితే షాకింగ్ గా ఈ సినిమాకి పోటీగా మరో సినిమా వస్తున్నట్టు చెబుతున్నారు. అదే ‘భారతీయుడు 2’. 

భారీ సినిమాల దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. 1996లో వచ్చి దేశ వ్యాప్తంగా సూపర్ హిట్ గా నిలిచిన ‘భారతీయుడు’ సినిమాకి సీక్వెల్‌గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. శరవేగంగా షూట్ జరుపుకుంటోన్న ఈ సినిమాని 2021 జనవరి 14న విడుదల చేబోతున్నట్లు చెబుతున్నారు. 

మన ఆర్ఆర్ఆర్ లాగానే శంకర్‌ కూడా ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ రెండు ప్యాన్ ఇండియా సినిమాలు దాదాపు వారం గ్యాప్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో వసూళ్ల పరంగా ఈ రెండు సినిమాలకి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. అయితే నిజంగా భారతీయుడు సీక్వెల్ సంక్రాంతికే వస్తుందా ? లేక అది ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతుందా ? అని వేచి చూడాలి.  

More Related Stories