English   

కార్తికేయ 2 కాన్సెప్ట్ వీడియో కేక.. నిఖిల్ కొడతాడా..

karthekaya
2020-03-01 19:16:45

టాలీవుడ్ లో ఇప్పుడు నిఖిల్ కు మంచి డిమాండ్ ఉంది. ఈ కుర్ర హీరో ఓ క‌థ ఫైన‌ల్ చేసాడంటే అందులో ఏదో విశేషం ఉంద‌ని న‌మ్ముతున్నారు ప్రేక్ష‌కులు. మధ్యలో కొన్ని సినిమాలు అలా తేడా కొట్టినా కూడా సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు ఈయన. ఏడాది వాయిదాల తర్వాత విడుదలైన అర్జున్ సురవరం సినిమా కూడా మంచి విజయమే సాధించింది. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్న ఈ కుర్ర హీరో ఇప్పుడు సాహసం చేయడానికి సిద్ధమైపోయాడు. తెలుగు ఇండస్ట్రీలో సీక్వెల్ కథలకు కలిసిరాదని తెలిసి కూడా ఈయన సీక్వెల్ చేయబోతున్నాడు. ఆరేళ్ల కింద ఈయన నటించిన కార్తికేయ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ చేస్తున్నాడు ఈయన. స్వామిరారా నుంచి అర్జున్ సురవరం వ‌ర‌కు నిఖిల్ నమ్మ‌కం మ్యాగ్జిమ‌మ్ గెలిచింది. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. మొన్న‌టి వ‌ర‌కు సీక్వెల్ అంటే తెలుగు ఇండ‌స్ట్రీ భ‌య‌ప‌డేది. కానీ బాహుబ‌లి 2తో బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ అయిపోయింది.

ఈ సినిమాతో రాజమౌళి అందరికీ ధైర్యాన్నిచ్చాడు. దాంతో ఇప్పుడు హ్యాపీగా సీక్వెల్ క‌థ‌ల‌పై దృష్టి పెడుతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కార్తికేయ తొలిభాగం ఎక్కడైతే ముగిసిందో.. అక్క‌డ్నుంచే రెండవ భాగం అక్కడి నుంచే మొదలవుతుందని నిఖిల్ చెప్పాడు. ఇప్పుడు కాన్సెప్ట్ వీడియో కూడా విడుదల చేసారు చిత్రయూనిట్. ఇది చూసిన తర్వాత కచ్చితంగా సినిమా హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఇందులో కూడా గుడి రహస్యాలు చెప్పబోతున్నాడు చందూ. ఈ సినిమా షూటింగ్ చైత్ర మాసంలో మొదలు కానుంది. 2021లో సినిమా విడుదల కానుంది. సవ్యసాచి సినిమా ఫ్లాప్ తర్వాత చందూ మొండేటి రేస్ లో వెనకబడ్డాడు. దాంతో కార్తికేయ 2తో మరోసారి హిట్ కొట్టాలని చూస్తున్నాడు ఈ దర్శకుడు. ఈ సినిమాను ముందు దిల్ రాజు నిర్మిస్తాడనే వార్తలు వచ్చినా కూడా ఇప్పుడు మారిపోయి పీపుల్స్ ఫ్యాక్టరీ టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు.

 

More Related Stories