English   

కేజీఎఫ్ 2 రిలీజ్ అప్పటికి ప్లాన్ చేశారా...

KGF Chapter 2
2020-03-13 11:14:55

ప్రశాంత్ నీల్ దర్శత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న కె.జి.ఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్ 2. కె.జి.ఎఫ్ 1 ఏమేరకు సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా మనం మళ్ళీ ప్రస్తావించక్కర్లేదు. కన్నడలో ఆడితే చాలు అనుకుంటూ మేకర్స్ చేసిన ఆ సినిమా కన్నడలోనే కాక తెలుగు, తమిళ, హింది భాషల్లో కూడా భారీ విజయాన్ని సాధించింది. కె.జి.ఎఫ్‌ సినిమా జోరుతో కె.జి.ఎఫ్‌- చాప్టర్ 2 కూడా అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు.

 అయితే మొదటి పార్ట్ కి వచ్చిన క్రేజ్ దృష్ట్యా బాలీవుడ్ సహా కొన్ని బాషలలో కీలకమైన పాత్రల కోసం స్టార్ నటులను రోప్ చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ మెయిన్‌ విలన్‌ అధీరా పాత్రలో నటిస్తుండటం అలాగే లేడీ ప్రధానమంత్రిగా రవీనా టాండన్‌ నటిస్తుండడంతో ఈ సినిమా మీద ఇంకా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరపుకుంటోంది. హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకి  ప్రశాంత్ నీల్  దర్శకత్వం వహిస్తున్నారు. 

ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా పడిన నేపథ్యంలో అదే తేదీకి అంటే జూలై 30న కేజీఎఫ్ 2 రిలీజ్ కానుందన్న ప్రచారం జరగుతోంది కూడా. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఒక విషయం మళ్ళీ ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాకి గ్రాఫిక్స్ వర్క్ కూడా ఉన్నందున అది జూలై కి పూర్తి కాదని అందుకే ఈ సినిమాని దసరా నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందకు యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. తెలుగులో వారాహి సంస్థ రిలీజ్ చేస్తోన్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఒకరకంగా తెలుగు వాళ్ళు ఆర్ఆర్ఆర్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో కేజీఎఫ్ 2 కోసం కూడా అంతే ఎదురు చూస్తున్నారు. 

More Related Stories