బాహుబలి 2 రికార్డులు దాటేసిన మహేష్ బాబు

అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా సంక్రాంతికి రిలీజయి అనేక రికార్డులు సొంతం చేసుకున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఏకంగా 145 కోట్లకి పైగా షేర్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం రూ.121 కోట్ల షేర్ వసూలు చేసిందంటే ఈ సినిమా ఎలా జనాన్ని ఆకట్టుకుందో చెప్పకర్లేదు. అయితే ఈ సినిమా బాహుబలి రికార్డులు కూడా బద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. ఒక ప్రముఖ ఛానెల్ లో ప్రసారమైన సరిలేరు నీకెవ్వరు ఏకంగా 23.4 టీవీఆర్ సాధించినట్టు చెబుతున్నారు.
ఇప్పటి వరకు టాలీవుడ్ లో బాహుబలి2 సినిమా మాత్రమె 22.70 సాధించి మొదటి స్థానంలో ఉంది ఆ సినిమా తరువాత బాహుబలి తొలి పార్ట్ 21.84 రేటింగ్ రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ రెండు సినిమాలను దాటేసి మరీ మహేష్ సినిమా మొదటి స్థానానికి ఎగబాగికింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. నిజానికి ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో కూడా వచ్చేసింది. ఈ హెచ్డీ ప్రింట్‌ను కొంత మంది ఫేస్బుక్, మూవీ రూల్జ్ లాంటి వాటిలో కూడా పెట్టేశారు. అయినా ఉగాది కానుకగా వచ్చిన ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు రికార్డు స్థాయిలో టీవీఆర్ వచ్చింది.