ఇండియన్ 2 సినిమాని ఆపేస్తారా.. విసుగొచ్చేసిందా

ఇండియన్ డైరెక్టర్ లలో చెప్పుకోదగ్గ వారిలో ఒకరయిన శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా 'భారతీయుడు 2' సినిమా రూపొందుతోంది. వీరిద్దరి కాంబినేషన్ లో సుమారు ఇరవైఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ వారి నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తోంది. గత ఏడాది జనవరి నెలలో మొదలయిన ఈ సినిమా ఇప్పటిదాకా కొంత భాగం షూటింగ్ మాత్రమే పూర్తిచేసుకుంది. ఆ మధ్య ఈ సినిమా షూటింగు ఆగిపోయిందనే ప్రచారం మొదలైంది.
మొదటి షెడ్యూల్ ని పరిమితికి మించి ఖర్చు పెట్టించాడని కానీ అవుట్ పుట్ సరిగా లేదని నిర్మాతలకి దర్శకుడికి మధ్య తలెత్తిన విభేదాలే షూట్ బ్రేక్ పడడానికి కారణమనే టాక్ వచ్చింది. అయితే ఆ తరువాత మొదలయింది అనుకోండి అది వేరే విషయం అయితే నిజానికి ఈ సినిమా మొదలైనప్పటి నుండి ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది. ఇండియన్ 2 చిత్ర షూటింగ్ మొదలైనప్పుడు ఏవో కారణాల వల్ల కొద్ది రోజులు షూటింగ్ ఆగింది. కమల్ కాలు ఆపరేషన్ అని షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు, ఆ తరువాత మళ్ళీ లోక్ సభ ఎలక్షన్స్ అని చెప్పి మరి కొంత బ్రేక్ ఇచ్చారు.
ఇక మొన్న ఫిబ్రవరి నెలలో క్రేన్ విరిగిపడి ఘోరమైన ప్రమాదం వాటిల్లి ప్రాణనష్టం జరిగింది. ఆ ప్రమాదం నుండి కోలుకొని మళ్లీ షూటింగ్ ప్రారంభిద్దాం అనుకునేలోపు కరోనా వైరస్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. ఇలా ఈ సినిమాకి అవాంతరాలు మాటిమాటికీ ఎదురవుతున్న నేపథ్యంలో ఇండియన్ 2 చిత్రాన్ని ఆపేస్తేనే బెటరేమో అని నిర్మాతలు ఆలోచిస్తున్నారనే టాక్ కోలీవుడ్ లో మొదలయింది. అయితే ఇప్పటికే కోట్లు ఇన్వెస్ట్ చేసిన వారు సినిమా ఆపేస్తారు అంటే నమ్మదగ్గ విషయం కాదు. మరి ఎందుకో ఈ ప్రచారం అయితే జరుగుతోంది.