English   

కార్తికేయ 2 సీక్వెల్ కాదట 

Karthikeya 2
2020-04-09 11:08:37

అప్పుడెప్పుడో నిఖిల్, కలర్స్ స్వాతి లీడ్స్ గా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'కార్తికేయ' మంచి హిట్ గా నిలిచింది. అప్పుడే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈ హిట్ సినిమాకి సీక్వెల్‌గా ‘కార్తికేయ-2’ సినిమాని ప్లాన్ చేశారు. నిఖిల్ హీరోగా, చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ-2' పేరుతో రూపొందనున్నట్టు గత ఏడాది మేలోనే ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించాలని భావించినా అది ఎందుకో గానీ లేటయింది. ఇక మార్చి నెల మొదటిలో తిరుమలలో ఈ సినిమా ఓపెనింగ్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా మీద కూడా లాక్ డౌన్ ఎఫెక్ట్ పడి ఆగిపోయింది.

అయితే ఇదిలా ఉండగా ఉండగా ఈ మధ్య కాలంలో ఈ సినిమా నుంచి ఒక కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆ టీజర్ ను చూస్తే ద్వాపర యుగానికి సంబంధించిన ఒక రహస్యాన్ని ఈ యుగంలో దానిని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నంగా ఈ కథ ఉండనుంది. ఈ లెక్క చూస్తే ఇది కార్తికేయ సీక్వెల్ కాదంటున్నారు. కార్తికేయకు ఈ సినిమాకు సంబంధం ఏం ఉండదని కృష్ణుడి ద్వారక నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. కార్తికేయ కంటే కూడా ఈ సినిమా స్టోరీ ఇంకా బాగుంటుందని అంటున్నారు. ఈ సినిమాని  తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ మీద నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.

More Related Stories