English   

కరోనా క్రైసిస్ ఛారిటీకి కాజల్ 2 లక్షల విరాళం.. 

Kajal Aggarwal
2020-04-16 17:30:15

మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సినీ కార్మికుల కోసం టాలీవుడ్ ఏర్పాటు చేసిన కరోనా క్రైసెస్ ఛారిటీకి ఇప్పటికే చాలా మంది తమవంతు సాయం అందిస్తున్నారు. అందులో హీరోలే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్లు అయితే ఎవరూ పెద్దగా స్పందించింది లేదు. కానీ ఇప్పుడు కాజల్ ముందుకొచ్చింది. ఈమె తన వంతుగా 2 లక్షల రూపాయలను విరాళంగా అందించింది. అయితే కాజల్ ఇచ్చిన డొనేషన్ చూసి కొందరు సెటైర్లు వేస్తున్నారు. సినిమాకు 2 కోట్లు తీసుకునే కాజల్ ఇంతపెద్ద మొత్తం ఎలా విరాళంగా ఇచ్చిందబ్బా అంటూ సెటైర్లు వేస్తున్నారు. లేకపోతే మరేంటి.. కనీసం 10 లక్షలు కూడా లేకుండా 2 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడమేంటి అంటున్నారు అభిమానులు కూడా. తన మేనేజర్ గిరిధర్ ఈ విరాళాన్ని CCCకి ఆర్టిజిఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసామని చెప్పాడు. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి ఆచార్య.. తమిళనాట భారతీయుడు 2 సినిమాలతో బిజీగా ఉంది. పవన్, హరీష్ శంకర్ సినిమాలో కూడా ఈమెనే అనుకుంటున్నారు. 

More Related Stories