English   

కలర్ స్వాతి రీ ఎంట్రీ.. కార్తికేయ 2లో కీలక పాత్ర..

Swathi Nikhil
2020-04-22 15:10:54

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో వరుసగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ కం హీరోయిన్ కలర్స్ స్వాతి. అయితే పెళ్లి తర్వాత ఈమె పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది. ఈ మధ్య మళ్ళీ భర్తకు విడాకులు ఇస్తుందని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కలర్ స్వాతి. ఈ క్రమంలోనే ఆమె మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం నిఖిల్, చందు మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కార్తికేయ 2 సినిమాలో ఈమె కీలక పాత్రలో నటించబోతోందని ప్రచారం  జరుగుతుంది. ఐదేళ్ల కిందట వచ్చిన కార్తికేయ సినిమాలో కలర్స్ స్వాతి హీరోయిన్. ఆ సినిమా సంచలన విజయం సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ చేస్తున్నాడు చందు మొండేటి. సవ్యసాచి సినిమా తర్వాత ఈయన చేస్తున్న సినిమా ఇదే. 

కార్తికేయ 2లో కూడా కలర్ స్వాతి కీలక పాత్రలో నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో స్వాతి హీరో నిఖిల్ కి మాజీ ప్రేయసిగా నటిస్తోందని తెలుస్తోంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ ను మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సీక్వెల్ కూడా మొదటి భాగం లాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్ తో తెరకెక్కుతుందని.. అలాగే ఈ కథకు నేపథ్యంగా ఎంచుకున్న ఒక చారిత్రాత్మక అంశం ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటుందని తెలుస్తుంది. చందూ మొండేటి ఇప్పటికే స్క్రిప్టును పకడ్బందీగా రాసుకున్నాడని.. లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఆలస్యం లేకుండా సినిమా పట్టాలెక్కుతుందని చెబుతున్నారు యూనిట్ సభ్యులు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి జి విశ్వప్రసాద్.. వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతో కలర్స్ స్వాతి రీ ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి. 

More Related Stories