English   

మన్మధుడు 2 డిజాస్టర్ కి కారణం అతనే...ఇప్పుడెం చేస్తారు 

Rahul Ravindran
2020-04-29 10:44:06

ఆఫీసర్ సినిమా డిజాస్టర్ తర్వాత నాగార్జున ఎన్నో ఆశలతో చేసిన మల్టీ స్టారర్ దేవదాస్ కూడా నిరాశ పరిచింది. ఇక ఆయన నుండి చివరిగా రిలీజ్ అయిన మన్మథుడు-2 సినిమా సైతం ఆయనకు భాటీ దెబ్బ వేసిన్దనే చెప్పాలి. నిజానికి ఒక రకంగా నాగార్జునకి మన్మధుడు సినిమా తరువాత అదే పేరు బిరుదుగా మారిపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, విజయ్ భాస్కర్ డైరెక్షన్ మన్మధుడు సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అయితే దానికి సీక్వెల్ గా తీసిన ఈ సినిమా మాత్రం పెద్ద దెబ్బ వేసింది. ఈ సినిమాని చి.ల.సౌ సినిమాతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాని తెరకెక్కించాడు. 

అయితే ఒక్క సినిమా హిట్ అవగానే ఈ సినిమాని నాగార్జున రాహుల్ రవీంద్రన్ కి అప్పగించడానికి అంత పిచ్చోడెమీ కాదు. అయితే అలా చేయడానికి కొన్ని వ్యక్తిగత కారణాలున్నాయని ఆ మధ్య చెప్పుకున్నారు. ఆ కారణాలలో అందులో ఒకటి రాహుల్ భార్య చిన్మయి శ్రీపాద సమంత కి క్లోజ్ ఫ్రెడ్ అవడం ఒకటి కాగా చిలసౌ మేకింగ్ కూడా నాగార్జునకి బాగా నచ్చడం మరో కారణమని అంటున్నారు. అయితే ఈ సినిమా మేయిన్ కథ కూడా వేరే భాషకి చెందినది కావడంతో కధ చెప్పినప్పుడు నాగార్జున బాగా నమ్మాడు. దీంతో మన్మధుడు సృష్ఠించిన రికార్డ్ ని కూడా మర్చిపోయి రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా పెట్టి ఎక్కువ బడ్జెట్ పెట్టి మరీ సినిమా నటించాడు. అయితే ఈ సినిమా మీద ముందు నుంచి నెగిటివ్ టాక్ వచ్చించి. అయితే ఈ సినిమాలో నటించి, నిర్మించిన నాగార్జున ఆయనే అందరికంటే ఎక్కువ మటలు పడ్డారు. అయితే దీనంతటికి కారణం మాత్రం రాహుల్ రవీంద్రన్ అని తర్వాత తెలుసుకున్నా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏముందని అంటున్నారు. 

More Related Stories