English   

ఇండియ‌న్ 2 ఆగిపోలేదు.. అవన్నీ రూమర్స్ !

lyca
2020-05-08 08:14:56

ఇండియన్ డైరెక్టర్ లలో చెప్పుకోదగ్గ వారిలో ఒకరయిన శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా 'భారతీయుడు 2' సినిమా రూపొందుతోంది. వీరిద్దరి కాంబినేషన్ లో సుమారు ఇరవైఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ వారి నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తోంది. గత ఏడాది జనవరి నెలలో మొదలయిన ఈ సినిమా ఇప్పటిదాకా కొంత భాగం షూటింగ్ మాత్రమే పూర్తిచేసుకుంది. ఆ మధ్య ఈ సినిమా షూటింగు ఆగిపోయిందనే ప్రచారం మొదలైంది ఒక రెండు మూడు రోజుల నుండి. మొదటి షెడ్యూల్ ని పరిమితికి మించి ఖర్చు పెట్టించాడని కానీ అవుట్ పుట్ సరిగా లేదని నిర్మాతలకి దర్శకుడికి మధ్య తలెత్తిన విభేదాలే షూట్ బ్రేక్ పడడానికి కారణమనే టాక్ వచ్చింది. ఇండియ‌న్ 2 చిత్ర షూటింగ్ మొద‌లైన‌ప్పుడు ఏవో కార‌ణాల వ‌ల్ల  కొద్ది రోజులు షూటింగ్ ఆగింది.

క‌మ‌ల్ కాలు ఆప‌రేషన్ అని షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు, ఆ తరువాత మళ్ళీ లోక్ సభ ఎలక్షన్స్ అని చెప్పి మరి కొంత బ్రేక్ ఇచ్చారు. ఇక మొన్న ఫిబ్రవరి నెలలో క్రేన్ విరిగిపడి ఘోరమైన ప్రమాదం వాటిల్లి ప్రాణనష్టం జరిగింది. ఆ ప్రమాదం నుండి కోలుకొని మళ్లీ షూటింగ్ ప్రారంభిద్దాం అనుకునేలోపు కరోనా వైరస్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. ఇలా ఈ సినిమాకి అవాంత‌రాలు మాటిమాటికీ ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో ఇండియ‌న్ 2 చిత్రాన్ని ఆపేస్తేనే బెట‌రేమో అని నిర్మాత‌లు ఆలోచిస్తున్నారనే టాక్ కోలీవుడ్ లో మొదలయింది. అయితే తాజాగా  ఈ వార్తల పై స్పందించిన లైకా ప్రొడక్షన్స్ యాజమాన్యం.. ఈ వార్తల్లో అసలు నిజం లేదని కేవలం రూమర్స్ మాత్రమేనని కొట్టి పారేసింది. ఇప్పటికే 60 శాతం వరకూ షూటింగ్ పూర్తయిన ఈ సినిమాని ఎందుకు ఆపేస్తామని ప్రశ్నిస్తున్నారు. అంతే కాక లాక్ డౌన్ ముగిసిన వెంటనే మిగిలిన షూట్ ను కూడా వీలయినంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు.

More Related Stories