English   

తుపాకి 2కి సర్వం సిద్ధం.. విజయ్ ఫ్యాన్స్‌కు పండగే..

vijay
2020-05-08 19:05:42

విజ‌య్ సినిమా అంటే ఇప్పుడు అభిమానుల‌కు పండ‌గే. కొన్నేళ్లుగా ఆయ‌న ఎంచుకుంటున్న క‌థ‌లు.. చేస్తున్న సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ గానే కాకుండా స‌మాజానికి కూడా ప‌నికొచ్చేలా ఉన్నాయి. అలాంటి క‌థ‌లే చేస్తున్నాడు ఈయ‌న‌. ఒక్కో సినిమాతో త‌న రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు విజ‌య్ సినిమా వ‌స్తుందంటే చాలు గ‌వ‌ర్న‌మెంట్ కు కూడా వ‌ణుకు పుడుతుంది.. ఏ సినిమాలో ఏం అన్యాయాల‌ను ఎత్తి చూపిస్తాడో అని. మెర్స‌ల్ లో మెడిక‌ల్ మాఫియా.. మొన్న స‌ర్కార్ లో ప్ర‌భుత్వ త‌ప్పులు.. అంత‌కుముందు క‌త్తిలో రైతు స‌మ‌స్య‌లు ఇలా ఒక్కో సినిమాలో ఒక్కోటి చూపిస్తున్నాడు విజ‌య్. నిన్న విజిల్ సినిమాలో అమ్మాయిలపై జరుగుతున్న దాడులు, క్రీడల్లో రాజకీయాలు చూపించాడు. ఇప్పుడు ఫ్యాన్స్ కు మ‌రో గ్రేట్ న్యూస్ చెప్పాడు మురుగ‌దాస్.

త్వ‌ర‌లోనే తాను తుపాకి సీక్వెల్ చేయ‌బోతున్నాన‌ని అనౌన్స్ చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. స‌ర్కార్ తో సంచ‌ల‌నం సృష్టించిన ఈ కాంబినేష‌న్ నాలుగోసారి క‌ల‌వ‌బోతున్నారు. తుపాకితో తొలిసారి విజ‌య్ తో క‌లిసాడు మురుగ‌దాస్. అది 2012లో విడుద‌లైంది.. అది అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీ హిట్. ఆ త‌ర్వాత క‌త్తితో 2014లో మ‌రోసారి ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాసారు. ఇక మొన్న విడుద‌లైన స‌ర్కార్ కూడా 250 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇప్పుడు నాలుగోసారి క‌లిసి ప‌ని చేయ‌బోతున్నారు. పైగా తుపాకి సీక్వెల్ అని చెప్పాడు మురుగ‌దాస్. దాంతో అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగిపోతున్నాయి. క‌చ్చితంగా ఈ సారి కూడా విజ‌య్, మురుగ‌దాస్ ఇండ‌స్ట్రీ రికార్డుల‌తో చెడుగుడు ఆడుకోవ‌డం ఖాయం అంటున్నారు విశ్లేష‌కులు. ప్రస్తుతం మాస్టర్ సినిమాతో బిజీగా ఉన్నాడు విజయ్. ఈ చిత్రం తర్వాత మరో రెండు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత తుపాకి 2 ఉండబోతుంది.

 

More Related Stories