English   

కేజీఎఫ్ 2 అధీరా లుక్ లీక్..నిజమేనా 

 Sanjay Dutts Adheera
2020-05-21 10:28:31

2018 చివర్లో కన్నడ సినీ ఇండస్ట్రీ నుండి విడుదలైన కెజీఎఫ్ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా కేవలం మౌత్ టాక్ తోనే ఘనవిజయం సాధించి కన్నడ ఇండస్ట్రీకి తలమానికంగా నిలిచింది. ఈ సినిమా ఇంత ఎత్తున ఫేమస్ కావడంతో కేజీఎఫ్‌కు కొనసాగింపుగా కేజీఎఫ్‌ ఛాప్టర్ 2ని తెరకెక్కిస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక యష్ తో పాటు కేజీఎఫ్ కి కూడా మార్కెట్ పెరగడంతో బాలీవుడ్ సహా కొన్ని బాషలలో కీలకమైన పాత్రల కోసం స్టార్ నటులను రోప్ చేశారు. యష్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ మెయిన్‌ విలన్‌ అధీరా పాత్రలో నటిస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది.

తాజా సమాచారం ప్రకారం కేజీఎఫ్ 2 క్లైమాక్స్ సీన్స్ భారీ యాక్షన్ ప్యాకేజ్ త్గో కూడు ఉంటుందని, యశ్ .. సంజయ్ దత్ మధ్య జరిగే పోతూ భీకరంగా ఒళ్ళు గగుర్పొడిచేంత రేంజ్ లో ఉండేలా తెరకెక్కిస్తున్నారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే ఆ విషయం మీద ఎలాంటి అప్డేట్ లేకున్నా తాజాగా ఇదే అధీరా లుక్ అంటూ సోషల్ మీడియాలో ఒక లుక్ హల్చల్ చేస్తోంది. ఈ పిక్ లో అయితే నిజంగానే మదమెక్కిన ఖడ్గమృగం లానే కనిపిస్తున్నారు సంజయ్. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరపుకుంటోంది. హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాని ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా పడిన నేపథ్యంలో అదే తేదీకి అంటే జూలై 30న కేజీఎఫ్ 2 రిలీజ్ కానుందన్న ప్రచారం జరగింది. అయితే ఈ సినిమాని దసరా నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందకు యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు కూడా ఇప్పటిదాకా ప్రచారం జరిగింది. అనుకున్నట్టుగానే ఈ సినిమా విడుదల మీద సినిమా యూనిట్ కీలక ప్రకటన చేసింది. కేజీఎఫ్ చాప్టర్ 2ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 23న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.

More Related Stories