English   

దృశ్యం 2 వచ్చేస్తుంది.. వెంకటేష్ సిద్ధంగా ఉన్నాడా..?

venky
2020-05-22 07:17:28

వెంకటేష్ ఈ మధ్య కాలంలో నటించిన బెస్ట్ రీమేక్ సినిమాల్లో దృశ్యం ఒకటి. మూడేళ్ల కింద వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. దానికి ముందు మలయాళంలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ సినిమాను అదే పేరుతో అన్ని భాషలు కూడా రీమేక్ చేసాయి. ఈ సినిమా అప్పట్లో 100 కోట్లు వసూలు చేసి మలయాళ సినిమా స్థాయిని పది రెట్లు పెంచేసింది. ఇటువంటి సినిమాకు ఇప్పుడు సీక్వెల్ చేయబోతున్నాడు దర్శకుడు జీతూ జోసెఫ్. మే 21న మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా మలయాళం ఇండస్ట్రీలో దృశ్యం సీక్వెల్ గురించి వార్తలొచ్చాయి. దీనికి మోహన్ లాల్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇందులో కూడా మీనా నటించబోతుందని.. సరికొత్త కథాంశంతో దర్శకుడు జీతూ జోసెఫ్ కథ సిద్ధం చేసాడని ప్రచారం జరుగుతుంది. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే ఈ సినిమా ప్రారంభం కానుందని విశ్లేషకులు చెప్తున్న మాట. సినిమా షూటింగ్స్‌కు అనుమతులు రాగానే సీక్వెల్ పనులు మొదలు కానున్నాయి. ఒకవేళ ఇదే కానీ జరిగితే 2021 ప్రథమార్థంలోనే దృశ్యం సీక్వెల్ విడుదల చేయాలని చూస్తున్నాడు జీతూ. ఈ క్రమంలోనే తెలుగులో కూడా ఈ సినిమాకు సీక్వెల్ రానుందా అనేది ఆసక్తికరంగా మారింది. వెంకటేష్ నటించిన ఈ చిత్రం ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ అయింది. దాంతో అక్కడ సీక్వెల్ వస్తే.. ఇక్కడ చేస్తారని వార్తలైతే వస్తున్నాయి. మరి దీనిపై దగ్గుబాటి హీరో ఏమంటాడనేది చూడాలి.

More Related Stories