English   

భారతీయుడు 2 టీమ్ కీలక నిర్ణయం..అక్కడ షూట్ చేయరట 

Indian 2
2020-05-23 10:51:27

ఇండియన్ డైరెక్టర్ లలో చెప్పుకోదగ్గ వారిలో ఒకరయిన శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా 'భారతీయుడు 2' సినిమా రూపొందుతోంది. వీరిద్దరి కాంబినేషన్ లో సుమారు ఇరవైఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ వారి నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తోంది. గత ఏడాది జనవరి నెలలో మొదలయిన ఈ సినిమా ఇప్పటిదాకా కొంత భాగం షూటింగ్ మాత్రమే పూర్తిచేసుకుంది. ఆ మధ్య ఈ సినిమా షూటింగు ఆగిపోయిందనే ప్రచారం మొదలైంది ఒక రెండు మూడు రోజుల నుండి. మొదటి షెడ్యూల్ ని పరిమితికి మించి ఖర్చు పెట్టించాడని కానీ అవుట్ పుట్ సరిగా లేదని నిర్మాతలకి దర్శకుడికి మధ్య తలెత్తిన విభేదాలే షూట్ బ్రేక్ పడడానికి కారణమనే టాక్ వచ్చింది. 

ఇండియ‌న్ 2 చిత్ర షూటింగ్ మొద‌లైన‌ప్పుడు ఏవో కార‌ణాల వ‌ల్ల  కొద్ది రోజులు షూటింగ్ ఆగింది. క‌మ‌ల్ కాలు ఆప‌రేషన్ అని షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు, ఆ తరువాత మళ్ళీ లోక్ సభ ఎలక్షన్స్ అని చెప్పి మరి కొంత బ్రేక్ ఇచ్చారు. ఇక మొన్న ఫిబ్రవరి నెలలో క్రేన్ విరిగిపడి ఘోరమైన ప్రమాదం వాటిల్లి ప్రాణనష్టం జరిగింది. ఆ ప్రమాదం నుండి కోలుకొని మళ్లీ షూటింగ్ ప్రారంభిద్దాం అనుకునేలోపు కరోనా వైరస్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. అయితే తాజాగా భారతీయుడు యూనిట్ కీలక నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అదేంటంటే మొన్న క్రేన్ ప్రమాదం జరిగిన పూందమల్లి సమీపంలోని స్టూడియో లో ఈ షూట్ చేయకూడదని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఎందుకు తీసుకున్నారో కానీ ఆ సినిమాని ఇంకా అక్కడ షూట్ చేయకూడదని అనుకున్నారట. చెన్నై ఎయిర్ పోర్ట్ సమీపంలోని బిన్నీ మిల్లులో సెట్‌ వేసి చిత్రీకరణ చేయనున్నట్లు కోలీవుడ్‌ లో ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం ఎంత ఉంది అనేది తెలియాల్సి ఉంది.

More Related Stories