English   

అవతార్ 2 షూటింగ్ షురూ.. కరోనా నుంచి కోలుకుని..

Avatar
2020-05-23 17:16:11

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వేలాది సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. సినిమా పరిశ్రమ కూడా కోట్లాది రూపాయలు నష్టపోయింది. అందులో చిన్న సినిమాలున్నాయి.. భారీ సినిమాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే కరోనా కారణంగా కొన్ని సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మరుగున పడిపోయాయి. ఇప్పుడిప్పుడే వాటికి అనుమతులు ఇస్తున్నారు. దాంతో దర్శక నిర్మాతలు కూడా పని మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే మే చివరి వారం నుంచి అవతార్ 2 సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్ర తదుపరి షెడ్యూల్ కోసం జూన్ మొదటి వారంలో న్యూజిలాండ్‌కి వెళ్లనుంది చిత్ర యూనిట్. 

అవతార్ 2 నిర్మాతల్లో ఒకరైన జోన్ లాండౌ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రాబోయే షెడ్యూల్ గురించి అధికారికంగా ప్రకటించాడు. దాంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. జేమ్స్ కామెరూన్ కూడా తన యూనిట్ బిహైండ్ సీన్స్ విడుదల చేసాడు. చేశారు. సముద్ర గర్భం నేపథ్యంగా సాగే సన్నివేశాలు ఈ సినిమాలో చాలా ఉంటాయని.. వాటికి సంబంధించి బోట్ సెట్లు ఇవే అంటూ కొన్ని ఫోటోలు పోస్ట్ చేసాడు ఈయన. జో సల్దానా, సామ్ వర్తింగ్‌టన్, కేట్ విన్స్లెట్ మరియు క్లిఫ్ కర్టిస్ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 17, 2021న విడుదల కానున్నట్లు తెలుస్తుంది. మార్చ్ లో ఈ చిత్ర షూటింగ్‌కు కరోనాతో బ్రేక్ పడింది. పదేళ్ల కింద విడుదలైన అవతార్ తొలి భాగం ప్రపంచ సినీ చరిత్రలో ప్రతీ రికార్డును తన పేర రాసుకుంది. 

More Related Stories