ప్రారంభమయిన అవతార్ 2 షూటింగ్

లాక్డౌన్ వల్ల అన్ని చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. ధియేటర్లు ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియని పరిస్థితి. ఇక కరోనా కారణంగా నిలిచిపోయిన షూటింగ్‌లు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. సడలింపుల్లో భాగంగా అవతార్-2 సినిమా షూటింగ్ ప్రారంభమైంది. జులై మొదటి వారం నుంచి 'జురాసిక్ వరల్డ్, డొమిని' చిత్ర షూటింగ్ ను కూడా ప్రారంభించనున్నట్లు యూనివర్సల్ స్టూడియోస్ వెల్లడించింది. ఇంగ్లాండ్‌లోని పైన్‌వుడ్ స్టూడియోలో జులై 6 నుంచి చిత్రీకరణ మొదలు పెడతామని ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాక నటీనటులు, సాంకేతిక బృందం విషయంలో కఠిన నియమాలు పాటిస్తామని తెలిపింది. ఇక తెలుగులో ఒక్క సినిమా ఇప్పటిదాకా మొదలయింది. రవిబాబు దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న క్రష్ సినిమా షూట్ జరుపుకుంటోంది. ఇక ఆర్ఆర్ఆర్ టెస్ట్ షూట్ జరగాల్సి ఉన్నా అనుకోని కారణాల వలన ఆగింది. అయితే తెలుగు నిర్మాతలు ఇప్పట్లో షూట్ కి వెళ్ళడం ఇష్టం లేదని కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఎవరో ఒకరు ముందుకు రాకుంటే ఈ షూట్ లో సాధ్యాధ్యాలు ఎలా బయటకి వస్తాయో ఏమో ?