English   

బిచ్చగాడు 2 ఫస్ట్‌లుక్ విడుదల చేసిన విజయ్ ఆంటోని

Vijay Antony
2020-07-24 19:07:18

వైవిధ్యభరితమైన చిత్రాలతో నిత్యం ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేసి సక్సెస్ సాధించడం విజయ్ ఆంటోని ప్రత్యేకత. నేడు విజయ్ ఆంటోనీ పుట్టినరోజు. ఈ సందర్భంగా 'బిచ్చగాడు 2' అనౌన్సమెంట్ పోస్టర్ విడుదల చేయడంతో పాటు సాంకేతిక నిపుణులను కూడా ప్రకటించారు. 'బిచ్చగాడు 2'  సినిమాకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రియా కృష్ణస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ ఆంటోని హీరోగా నిర్మాతగా వస్తున్న ఈ సినిమా తమిళంలో 'పిచ్చైకారన్ 2' తెలుగులో 'బిచ్చగాడు 2' పేరుతో రూపొందనుంది. 2021లో ఈ సీక్వెల్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

More Related Stories