English   

కేజీఎఫ్ 2 సముద్రం ఒడ్డున రాఖీ బాయ్

Yash
2020-10-10 09:22:21

బ్లాక్ బస్టర్ సినిమా కేజీఎఫ్ కు సీక్వెల్ గా కేజీఎఫ్ చాప్టర్ 2 ను చిత్రికరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ ముందు చక చకా చేసిన షూటింగ్ కు కరోనా లాక్ డౌన్ తో బ్రేక్ పడింది. దాంతో ఇటీవల షూటింగ్ లు తిరిగి ప్రారంభమయ్యాక ఆగస్టు చివరి వారంలో ప్రకాష్ రాజ్, మాళవిక మద్య జరిగే కొన్ని సీన్లను చిత్రించారు. అయితే తాజాగా సెట్లోకి హీరో యశ్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సంబందించిన ఓ సీన్ ను కర్ణాటక లోని కిన్నెర బీచ్ పదుకొనే వద్ద చిత్రిస్తున్నారు. కాగా షూట్ కు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో యశ్ బీచ్ ఒడ్డున నిలుచున్నారు. హీరో పక్కన హీరోయిన్ కూడా ఉండగా యశ్ అతడి హీరోయిన్ ను కార్లు చుట్టు ముట్టి రౌండ్స్ వేస్తున్నాయి. 

ఇదిలా ఉండగా కేజీఎఫ్ చాప్టర్ 1 సూపర్ హిట్ అవ్వడంతో కేజీఎఫ్ చాప్టర్ 2 పై అంచనాలు పెరిగాయి. దాంతో చాప్టర్ 2 లో సంజయ్ దత్, ప్రకాష్ రాజ్ లను సైతం సినిమాలో భాగం చేశారు. దాంతో అంచనాలు మరింత పెరిగాయి. అయితే సంజయ్ దత్ ఇటీవల అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారు. సంజయ్ దత్ పాత్ర  కీలక పాత్ర అధీర కావడంతో షూటింగ్ ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇటీవల భయటకు వచ్చిన సంజయ్ దత్ ఫోటో చూస్తే కూడా ఆయన ఇప్పుడే షూటింగ్ లో పాల్గొనే పరిస్థితి కనిపించడంలేదు. దాంతో సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.

More Related Stories