English   

కేజీఎఫ్2 రిలీజ్ అప్పుడే..తెలుగు హీరోలకు షాక్

KGF Chapter 2
2020-10-12 12:45:14

కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా వచ్చిన కేజీఎఫ్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ 2 ను భారీ బడ్జట్ తో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ఇప్పటికే మొదలవ్వగా లాక్ డౌన్ కారణంగా ఇంతకాలం షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఇటీవల చేసిన సడలింపులతో సినిమా షూటింగ్ మళ్ళీ ప్రారంభించారు. కేజీఎఫ్ 2 షూటింగ్ ను నవంబర్ వరకు పూర్తి చేస్తామని చిత్రయూనిట్ అంచనా వేస్తుంది. అయితే ఈ సినిమాను 2021 సంక్రాంతికి విడుదల చేయనున్నారు. కాగా సంక్రాంతి కి తెలుగు హీరోల సినిమాలే షూటింగ్ లు పూర్తిచేసుకుని విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అఖిల్ హీరోగా తెరకెక్కించిన బ్యాచిలర్, నితిన్ హీరోగా రంగ్ దే, బోయపాటి దర్శకత్వంలో వస్తున్న బాలయ్య సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్నాయి. అయితే సంక్రాంతి కి గనుక కేజీఎఫ్ 2 విడుదలైతే తెలుగు సినిమాలు డమాల్ అయ్యే ఛాన్స్ ఉందటూ వార్తలు వస్తున్నాయి. ఇక సంక్రాంతి కి కేజీఎఫ్ 2 సినిమాతో తెలుగు సినిమాలు పోటీ పడతాయా లేదా చూడాలి.

More Related Stories