English   

అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ ఎఫ్ 2 సినిమాకు ప్రతిష్టాత్మక అవార్డు.. 

Anil Ravipudi F2
2020-10-21 15:26:19

2019లో ఎన్ని సినిమాలు విడుదలైనా కూడా ఒక్కటి మాత్రం అందరినీ బాగా ఆకట్టుకుంది.. అందులో సీన్స్ గుర్తొచ్చినా కూడా పగలబడి నవ్వుకునేలా చేసింది. అదే ఎఫ్ 2.. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం గత సంక్రాంతికి విడుదలై 130 కోట్లకు పైగా గ్రాస్.. 70 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఇప్పుడు కేంద్రం ప్రతిష్టాత్మక అవార్డు అందించింది. వివిధ భాషలకు సంబంధించి 26 సినిమాలకు అవార్డులు కేంద్ర సమాచార ప్రసారశాఖ ప్రకటించింది. అందులో ఎఫ్ 2 కూడా ఉండటం విశేషం.

ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్ ఇండియా నుంచి సినిమాల ఎంపిక జరిగింది. అందులో ‘ఎఫ్‌ 2’ సినిమాకు కేంద్ర అవార్డు లభించింది. దీనిపై చిత్రయూనిట్ కూడా సంతోషాన్ని వ్యక్తం చేసారు. వెంకటేష్ కామెడీ టైమింగ్.. వరుణ్ తేజ్ తెలంగాణ యాస.. తమన్నా, మెహ్రీన్ కౌర్ అందాల ఆరబోతకు తోడు అనిల్ రావిపూడి పంచులు.. రాజేంద్ర ప్రసాద్ రోల్ అన్నీ కలిపి ఈ సినిమాను సంచలనం దిశగా అడుగులు వేసేలా చేసాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించాడు.

More Related Stories