English   

క్లైమాక్స్ కు చేరిన కేజీఎఫ్-2

Prashanth Neel Starts Filming Climax Scene Between Yash & Sanjay Dutt
2020-12-07 14:49:01

కన్నడతో పాటు ఇతర భాషల్లో విడుదలై రికార్డులు బ్రేక్ చేసిన సినిమా కేజీఎఫ్. ఈ సినిమా విజయంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సీక్వెల్ గా వస్తున్న కేజీఎఫ్2 ను భారీ బడ్జెట్ తో..భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో యశ్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక కరోనా కు ముందు ఈ సినిమా షూటింగ్ ను కొంతవరకు పూర్తి చేయగా లాక్ డౌన్ తో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక లాక్ డౌన్ సడలింపులతో షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. అంతే కాకుండా వచ్చిన గ్యాప్ ను కవర్ చేయడానికి షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ చేరింది. నవంబర్ చివారివారం నుండి హైదరాబాద్ ఫిల్మ్ సిటీలో హీరో యశ్, విలన్ సంజయ్ దత్ మధ్య జరిగే కీలక సన్నివేశాలను చిత్రించాడు. ఇక నవంబర్ 30న షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ మళ్ళీ   క్లైమాక్స్ బ్యాలెన్స్ సన్నివేశాలను  మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ భారీ యాక్షన్ సన్నివేశాన్ని తమిళ ఫైట్ మాస్టర్స్ అన్బు, అరివు నేతృత్వం లో తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ స్పాట్ లో ప్రశాంత్ నీల్..ఫైట్ మాస్టర్స్ తో కలిసి దిగిన ఫొటోను ప్రశాంత్ నీల్ ట్వీట్ పోస్ట్ చేసారు. "క్లైమాక్స్ ఇట్ ఈజ్..రాఖీ వర్సెస్ అథిర" అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు.

More Related Stories