English   

కేజీఎఫ్ 2 నుండి కీలక అప్డేట్

 KGF 2
2021-01-04 15:07:51

కేజీఎఫ్ సినిమా భారీ విజయం తరవాత దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్-2 ను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అంతే కాకుండా వివిధ ఇండస్ట్రీల నుండి ప్రముఖ నటులను సినిమాలో భాగం చేశారు. ఇక చాప్టర్-2 లోను హీరోగా యాష్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయ్యింది. చివరి షెడ్యూల్ లో సంజయ్ దత్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి సినిప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

ఇక తాజాగా ఈ సినిమా నుండి కీలక అప్డేట్ వచ్చింది. కేజీఎఫ్ చాప్టర్-2 టీజర్ ను జనవరి 8న  ఉదయం 10:18 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దాంతో టీజర్ పై సైతం ప్రేక్షకులకు అంచనాలు పెరిగాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు  సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. రవి బసురుర్ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. విజయ్ కిర్గన్డూర్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భారీ అంచనాల మధ్య వస్తున్న  కేజీఎఫ్ చాప్టర్-2 ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

More Related Stories