English   

యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్న కేజీఎఫ్2 టీజర్

 KGF Chapter 2
2021-01-08 18:12:02

కేజీఎఫ్ సినిమా విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేవు. కానీ సినిమా విడుదల తరవాత రికార్డులు సృష్టించింది. ఎక్కడ చూసినా కేజీఎఫ్ పాటలు..కేజీఎఫ్ సినిమా గురించే వినిపించింది. ఇక కేజీఎఫ్ సూపర్ హిట్ తరవాత దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ 2 ను ప్రేక్షకులను ఆకట్టుకునేలా భారీగా తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలకు ముందే భారీ క్రేజ్ వచ్చింది. ఇక గురువారం హీరో యశ్ పుట్టినరోజు సంధర్భంగా "కేజీఎఫ్ 2" టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ టీజర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డు సృష్టించింది. 

తక్కువ సమయంలో ఎక్కువ వ్యూవ్స్ వచ్చిన సినిమా టీజర్ గా రికార్డులు సృష్టించింది. అంతేకాకుండా ఇప్పటికీ సినిమా టీజర్ ట్రెండింగ్ లోనే ఉంది. ఇప్పటికే టీజర్ వ్యువ్స్ 50 మిలియన్స్ దాటిపోయాయి. చూస్తుంటే 100 మిలియన్ వ్యూవ్స్ సైతం క్రాస్ చేసేలా ఉంది. ఇక టీజర్ విషయానికొస్తే ఆధ్యంతం ఆకట్టుకునేలా ఉంది. టీజర్ లో యశ్ గన్ పట్టుకుని కార్లను పేల్చిన సీన్ హైలెట్ గా నిలిచింది. సంజయ్ దత్ లుక్ కూడా ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. ఇక భారీ అంచనాల నడుమ విడుదల అవుతున్న ఈ సినిమా థియేటర్లలో ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.

More Related Stories