English   

కేజీఎఫ్2 రిలీజ్ డేట్ ఫిక్స్

KGF Chapter 2
2021-01-30 02:12:50

కేజీఎఫ్ భారీ విజయం తరవాత ప్రశాంత్ నీల్ కేజీఎఫ్-2 ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన కేజీఎఫ్ దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజీఎఫ్ చాప్టర్ 2 ను భారీ తారాగణంతో చిత్రిస్తున్నారు. సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ యష్ కి విలన్ గా నటిస్తున్నారు. సినిమాలో యష్ సరసన శ్రీనిది శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాకుండా ప్రముఖ నటి రవీనా టనడాన్ కీలక పాత్రలో నటిస్తోంది. సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన కేజీఎఫ్-2 టీజర్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించింది. ఇప్పటివరకు టీజర్ కి 16 కోట్లకు పైగా వ్యువ్స్ వచ్చాయి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇక తాజాగా చిత్ర యూనిట్ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. సినిమాను ఈ ఏడాది జులై 16న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.

More Related Stories