English   

దృశ్యం 2 ట్రైలర్ టాక్.. కేసు రీఓపెన్ 

Drishyam 2
2021-02-08 15:19:55

2013లో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ‘దృశ్యం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తెలుగులో వెంకీ కథానాయకుడిగా.. తమిళంలో కమల్ హాసన్ కథానాయకుడిగా రీమేకై రెండు చోట్లా ఘనవిజయం సాధించింది.  ఇప్పుడు ‘దృశ్యం’ సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా దృశ్యం 2 ట్రైలర్ ను విడుదల చేసారు చిత్రయూనిట్.

ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. అప్పుడు కథ ఎక్కడ ముగిసిందో అక్కడ్నుంచే రెండో భాగం మొదలు కానుంది. పోలీస్ అధికారులు ఈ కేసును ఎలా పునః సమీక్షించారు? అన్నది ట్రైలర్ లో ఆవిష్కరించారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 19న మలయాళంలో సినిమా రిలీజ్ కానుంది. 

More Related Stories