English   

అందుకే హిట్ 2 కు నో చెప్పా ..విశ్వ‌క్ సేన్

Vishwak Sen
2021-03-29 11:40:39

వెళ్లిపోమాకే సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌యైన యంగ్ హీరో విశ్వ‌క్ సేన్. అయితే ఈ సినిమాతో విశ్వ‌క్ కు ఎలాంటి గుర్తింపు రాలేదు. ఆ త‌ర‌వాత త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమాలో న‌టించారు. ఈ చిత్రంతో విశ్వ‌క్ సేన్ కు మంచి గుర్తింపు ల‌భించింది. ఆ త‌ర‌వాత ద‌ర్శ‌కుడి అవ‌తారం ఎత్తి ఫ‌ల‌క్ న‌మా దాస్ సినిమాలో హీరోగా న‌టించి ఆయ‌నే దర్శ‌క‌త్వం కూడా చేసుకున్నారు. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. మ‌రోవైపు హిట్ సినిమాతో వ‌చ్చిన ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ఇక ఈరోజు పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న విశ్వ‌క్ సేన్ ఓ ఇంట‌ర్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. విశ్వ‌క్ హిట్ సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. 

ఈ చిత్రానికి శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వహించ‌గా నాని నిర్మించారు. ఇక ప్ర‌స్తుతం ఈ సినిమాకు సీక్వెల్ ను తెర‌కెక్కిస్తున్నారు. అయితే సీక్వెల్ లో హీరోగా అడ‌విశేషు న‌టిస్తున్నారు. దాంతో విశ్వ‌క్ ను సినిమాలో తీసుకోలేదా..లేదంటే ఆయ‌నే సీక్వెల్ లో న‌టించ‌న‌ని చెప్పారా..? అన్న అనుమానాలు మొద‌ల‌య్యాయి. అయితే ఇంట‌ర్యూలో విశ్వ‌క్ మాట్లాడుతూ..హిట్ సీక్వెల్ నేను చేయాల్సిందే..కానీ డేట్స్ స‌మ‌స్య వ‌ల్ల వ‌దులుకున్నా. వ‌చ్చే యేడాది నా ద‌ర్శ‌క‌త్వంలో ఓ నినిమాను తెర‌కెక్కిస్తా..అంతే కాకుండా ఈ న‌గ‌రానికి ఏమైంది, ఫ‌ల‌క్‌న‌మా దాస్ సీక్వెల్స్ చేసే ఆలోచ‌న‌లు ఉన్నాయ‌ని అన్నారు. ఇక ప్ర‌స్త‌తం విశ్వ‌క్ పాగ‌ల్ సినిమాలో న‌టిస్తున్నారు. ప్రాజెక్ట్ గామీ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. ఈ యేడాది మొత్తం మూడు సినిమాలు విడుద‌ల చేస్తాన‌ని విశ్వ‌క్ చెప్పారు. 

More Related Stories