English   

దృశ్యం 2 ఓటీటీ రిలీజ్ పై స్పందించిన సురేష్ బాబు

Suresh Babu
2021-04-23 16:35:15

వెంకటేష్ మలయాళ సినిమా దృశ్యం ను రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు దృశ్యం 2 తెలుగు రీమేక్ లోనూ వెంకటేష్ హీరోగా నటిస్తున్నారు. తెలుగు లో కూడా ఈ సినిమాకు ఒరిజినల్ దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకునట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండటం తో జూన్ లోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే కరోనా ఉధృతితో థియేటర్లు మూసేసుకున్నారు. 

ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మళ్లీ ఇప్పుడు తెరుస్తారో కూడా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో దృశ్యం 2 ఓటీటీలో విడుదల కాబోతోంది అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే డీల్ కుదిరిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆ వార్తలపై నిర్మాత సురేష్ బాబు స్పందించారు. దృశ్యం 2 తో ఓటీటీకి వెళ్లాలని అనుకోవడం లేదని చెప్పారు. అంతే కాకుండా థియేటర్ లు ఎప్పుడు పూర్తి స్థాయిలో తెరుచుకుంటే అప్పుడే సినిమామాను విడుదల చేస్తామని సురేష్ బాబు స్పష్టం చేశారు. ఈ సినిమాను మొదట  థియేటర్ లో చూసిన తరవతే ఓటీటీలో చూడాలని చెప్పారు.

More Related Stories