శంకర్ ఇండియన్ 2 వివాదం...ఎవరు తగ్గడం లేదు

2021-04-30 18:33:31
భారతీయుడు 2 చిత్రం పూర్తి చేయకుండా శంకర్ కొత్త సినిమాలు ప్రకటించడంపై లైకా సంస్థ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టుకెక్కింది. ఇండియన్ 2 సినిమా పూర్తి చేశాకే శంకర్ వేరే సినిమాలు మొదలు పెట్టేలా ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టులో పిటీషన్ వేసింది లైకా. ఈ క్రమంలో కోర్టు గొడవను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది. దీంతో శంకర్ తరపు లాయర్ రీసెంట్గా లైకా నిర్మాతలను కలిసి జూన్ నుండి అక్టోబర్ మధ్యలో శంకర్ ఇండియన్ 2 సినిమాను పూర్తి చేస్తారని అన్నారు. కాని లైకా మాత్రం జూన్ నాటికి సినిమాను ముగించి తీరాలని, ఇందులో ఎలాంటి మార్పు ఉండకూడదని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య చర్చలు విఫలం కావడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.న్యాయస్థానం ఏదో ఒకటి తేల్చి చెప్తేనే ‘ఇండియన్-2’ ముందుకెళ్ళేలా కనబడుతోంది.