English   

వ‌కీల్ సాబ్ 2 పై ద‌ర్శ‌కుడి క్లారిటీ

Venu Sriram
2021-05-07 13:12:40

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడేళ్ల గ్యాప్ త‌ర‌వాత మ‌ళ్లీ హీరోగా న‌టించిన సినిమా వ‌కీల్ సాబ్. హీందీలో అమితాబ్ చేసిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం వ‌చ్చింది. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వ‌ద్ద హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా...దిల్ రాజు సినిమాను నిర్మించారు. అంతే కాకుండా సినిమాలో హీరోయిన్ గా శృతి హాస‌న్ న‌టించింది. మ‌రోవైపు అన‌న్య‌, అంజ‌లి, నివేధిత తామ‌స్ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మ‌హిళ‌ల హ‌క్కుల నేప‌థ్యంలో వ‌చ్చిన ఈ సినిమాకు ప్రేక్షులు ఫిదా అయ్యారు. అంతే కాకుండా ప‌వ‌న్ అభిమానులు సినిమాకు సీక్వెల్ కూడా వ‌స్తే బాగుంటుంద‌న్న అభిప్రాయంతో ఉన్నారు. 

అయితే తాజాగా ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ ఓ ఇంట‌ర్య్వూలో సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు. ఇంట‌ర్యూలో యాంక‌ర్ ప‌వ‌న్ అభిమానులు అడిగిన ప్ర‌శ్నల‌ను వేణు శ్రీరామ్ కు వినించారు. అందులో ఓ అభిమాని వ‌కీల్ సాబ్ సినిమాకు సీక్వెల్ ఉంటుందా అని ప్ర‌శ్నించారు. వేణు శ్రీరామ్ మాట్లాడుతూ...నిజానికి త‌న‌కు ముందు సీక్వెల్ తీయాలన్న ఆలోచ‌న లేద‌ని కానీ ఫ్యాన్య్ స‌న్నిహితులు అడుతుంటే తీయాల‌నిపిస్తుంద‌ని చెప్పారు. వ‌కీల్ సాబ్ క్యారెక్ట‌ర్ బాగా ఎస్టాబ్లిష్ అయింద‌ని కాబ‌ట్టి కొన‌సాగింపుగా మ‌రో క‌థ‌ను రాసుకోవ‌చ్చ‌ని అన్నారు. అయితే ప‌వ‌న్ , దిల్ రాజు దానికి ఒప్పుకుంటే వ‌కీల్ సాబ్ 2 ఉంటుంద‌ని చెప్పారు. 

More Related Stories