English   

ది ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్ టాక్

The Family Man
2021-05-19 12:34:37

స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని డిజిటల్ ఎంట్రీ ఇస్తోంది. బుధవారం ‘ది ఫ్యామిలీ మెన్’ సీజన్ 2 ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉండడమే కాక సిరీస్‌పై అంచనాలను పెంచేసింది. శ్రీకాంత్‌(మనోజ్‌ భాజ్‌పాయ్‌).. జాతీయ దర్యాప్తు సంస్థకు రహస్యంగా పనిచేస్తుంటాడు. అతని భార్యగా ప్రియమణి నటించింది. అటు ఉద్యోగంలోని ఒత్తిడి, ఇటు ఫ్యామిలీలో ఒడిదొడుకులను మ్యానేజ్ చేయలేక సతమవుతుంటాడు శ్రీకాంత్. ఈ క్రమంలో ఆయన పై వచ్చే సన్నివేశాలు నవ్వులను పూయిస్తాయి.సమంత రాజీ అనే శ్రీలంక తమిళియన్‌గా సరికొత్త క్యారెక్టర్‌లో కనిపించింది.. యాక్షన్ సీన్స్‌లో సామ్ యాక్టింగ్ అదిరిపోయింది.. ఈ సిరీస్‌లో సమంత క్యారెక్టర్ హైలెట్ కానుంది. జూన్ 4 నుండి అమెజాన్ ప్రైమ్‌లో ‘ది ఫ్యామిలీ మెన్’ సీజన్ 2 స్ట్రీమింగ్ కానుంది.

More Related Stories